Benifits of Tea: టీ తాగని వారి కన్నా టీ తాగేవారిలో ఆ రిస్క్ తక్కువ.. బ్రిటన్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
New Study on Benifits of Tea: మీకు టీ తాగే అలవాటుందా.. అయితే టీ తాగనివారితో పోలిస్తే మీ గుండె జబ్బుల బారినపడే రిస్క్, మరణం సంభవించే రిస్క్ తక్కువగా ఉంటుందట..
New Study on Benifits of Tea: ఉదయాన్నే టీ తాగనిదే చాలామందికి రోజు మొదలవదు. కొందరు రోజులో ఒకసారి మాత్రమే టీ తాగుతారు. మరికొందరికి రెండు,మూడుసార్లయినా తాగనిదే తాగినట్లు అనిపించదు. టీ తాగడం చాలామంది ఒక రిలీఫ్‌గా ఫీలవుతుంటారు. అయితే టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే... బ్లాక్ టీ భేషుగ్గా తాగొచ్చు అని చెబుతోంది ఓ అధ్యయనం. ఇటీవల బ్రిటన్‌లో వెలువడిన ఆ అధ్యయనం బ్లాక్ టీ బెనిఫిట్స్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇంతకీ ఆ అధ్యయనం ఏం చెబుతోంది..
బ్రిటన్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం.. అసలు టీ తాగనివారితో పోలిస్తే రోజుకు రెండు కప్పుల బ్లాక్ టీ తాగేవారికి మరణం సంభవించే అవకాశం 9 శాతం తక్కువ. అలాగే, రోజుకు 3 కప్పుల బ్లాక్ టీ తాగేవారిలో ఆ అవకాశం 13 శాతం తక్కువ. బ్లాక్ టీ తాగేవారు హృదయ సంబంధిత వ్యాధులు, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ బారినపడే రిస్క్ తక్కువ.ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యూకెలో టీ తాగే అలవాటున్న 40-69 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 5 లక్షల మంది ఆరోగ్య పరిస్థితిని 14 ఏళ్ల పాటు గమనించారు.
భిన్న వాదనలు :
కేవలం అబ్జర్వేషన్ స్టడీస్‌ను పరిగణలోకి తీసుకుని కొన్ని విషయాలను నిర్ధారించలేమని కొంతమంది నిపుణుల వాదన. టీ తాగడం వల్ల ప్రత్యేకంగా ఈ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేందుకు సరిపడా ఆధారాలేవీ లేవని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మారియన్ అభిప్రాయపడ్డారు.
Also Read: CM Jagan: సీఎం జగన్ తో ముద్దుముద్దుగా మాట్లాడిన బాలిక మృతి.. అసలేం జరిగింది?
Also Read: Inadequate Sleep: మీరు సరిగా నిద్రపోవట్లేదా.. తగినంత నిద్ర లేకపోతే ఈ 6 ఆరోగ్య సమస్యలు తప్పవు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook