Coconut Water Myths and Facts for Pregnant Women: గర్భం దాల్చిన సమయంలో తరచూ కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లో అమ్మమ్మ, అమ్మ చెప్పడం మీరు వినే ఉంటారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పిల్లలకు జుట్టు బాగా వస్తుందని, మంచి రంగు తేలుతారని చెబుతుంటారు. అయితే ఇది నిజమేనా.. వట్టి భ్రమా.. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గర్భం దాల్చిన సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇది 95 శాతం స్వచ్ఛమైన నీరు. దీని ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. సాధారణ వ్యక్తి కన్నా గర్భిణిలకు హైడ్రేషన్ ఎక్కువ అవసరం. కాబట్టి కొబ్బరి నీళ్లు తరచూ తీసుకుంటే మంచిది. అయితే కొబ్బరి నీళ్లు తాగితే పుట్టబోయే పిల్లలకు జుట్టు బాగా వస్తుందని.. మంచి రంగు వస్తుందని చెప్పడంలో నిజం లేదు. 


కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు :


కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనది. చల్లగా, రిఫ్రెష్‌గా ఉంటుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. 


కొబ్బరి నీరులో ఉండే జీరో కొలెస్ట్రాల్ లక్షణాల వల్ల అది శరీర బరువును తగ్గించేందుకు దోహదపడుతుంది.


శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.


కొబ్బరి నీళ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరి నీరు తాగితే తల్లి, బిడ్డలను అది వ్యాధుల నుండి రక్షిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 'మోనోలారిన్'తో పోరాడే ఆమ్లాల ఉత్పత్తికి కారణమయ్యే లారిక్ యాసిడ్ జ్వరం, హెచ్ఐవి వంటి వ్యాధులను నివారిస్తుంది.


జీర్ణ శక్తిని పెంచుతుంది


ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. 


కొబ్బరి నీరు... అపోహలు.. :


1. పిల్లల రంగు పిల్లల తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నీటితో దానికి సంబంధం లేదు.
2. శిశువు జుట్టు జన్యు కారకంపై ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నీటికి జుట్టు ఎదుగుదలకు సంబంధం లేదు.
3. కొబ్బరి నీరు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అయితే ఇందులోనే అన్ని పోషకాలు ఉండవు. 


Also Read: Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..


Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook