16 Crucial Vitamins: అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే 16 కీలకమైన విటమిన్లు ఏవో తెలుసా
16 Crucial Vitamins: ఆరోగ్యం పేరుతో డయిటరీ విటమిన్స్ కోసం చాలా మంది లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే అవి నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
16 Crucial Vitamins: ఆరోగ్యం పేరుతో డయిటరీ విటమిన్స్ కోసం చాలా మంది లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే అవి నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
గూగుల్, నెట్ అందుబాటులో వచ్చాక అనే కంటే సాంకేతికత పెరిగే కొద్దీ అనవసర విషయాలపై అవగాహన ఎక్కువై లేనిపోని తలపోట్లు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యపరంగా ఏదైనా అసౌకర్యం కలిగితే చాలు..వెంటనే నెట్‌లో సెర్చ్ చేసి కావల్సిన విటమిన్లు కొనడం, తీసుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఆరోగ్యం పేరుతో డయిటరీ విటమిన్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఏటా 35 బిలియన్లు కేవలం డయిటరీ సప్లిమెంట్స్ విటమిన్స్ కోసం ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అవి నిజంగానే ఆరోగ్యకరమైన ప్రయోజనాల్ని అందిస్తున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వైద్య నిపుణులు. శరీరానికి కావల్సిన విటమిన్లను ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే అందిస్తుందని అంటున్నారు డాక్టర్ టెర్రెల్ స్మిత్. విటమిన్స్ లోపముందని నిర్ధారణ కానంతవరకూ, వైద్యుడి సలహా లేకుండా విటమిన్స్ తీసుకోవద్దంటున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బు వృధా అవడమే కాకుండా దుష్పరిణామాలుంటాయంటున్నారు. వాస్తవానికి విటమిన్లకు డబ్బులు ఖర్చు పెట్టడమనేది వృధా వ్యవహారమని చెబుతున్నారు. అలా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే కొన్ని రకాల విటమిన్ల గురించి తెలుసుకుందాం.
బయోటిన్
సాధారణంగా హెయిర్ గ్రోత్ కోసం బయోటిన్ వినియోగిస్తుంటారు. కానీ బయోటిన్ ఈ సమస్యకు సమాధానం కాదు. బయోటిన్‌ను విటమిన్ హెచ్ లేదా విటమిన్ బి7 అని పిలుస్తారు. హెల్తీ స్కిన్, హెయిర్, నెయిల్స్ కోసం ఇది ఒక తప్పనిసరి విటమిన్. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే కచ్చితంగా బయోటిన్ మీ శరీరంలో తగిన మోతాదులో ఉంటుంది. కాబట్టి అదనంగా బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం దండగే.
క్రోమియం
డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టే మరో విటమిన్ సప్లిమెంట్ క్రోమియం. ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుందని నమ్ముతారు. కానీ రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలోనే ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి అదనంగా క్రోమియం సప్లిమెంట్ తీసుకోవల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఇది అనవసర ఖర్చే.
ఐరన్
మరో ముఖ్యమైన విటమిన్ సప్లిమెంట్ ఐరన్. ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యధికంగా తీసుకునే విటమిన్ ఇది. ఐరన్ ఎక్కువగా ఉంటే మంచిదే కదా అనే అభిప్రాయంతో చాక్లెట్లు తిన్నట్టు తింటుంటారు కొందరు. వైద్యుడి సలహా, సూచన లేకుండా ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మోతాదుకు మించే హార్ట్ బీట్, లివర్ పెరగడం, క్యాన్సర్‌లకు దారి తీస్తుంది. వాస్తవానికి ఇది బీన్స్, డార్క్ చాకోలేట్స్, స్పినాచ్, బీఫ్, చికెన్‌లో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ ఎ
విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. విటమిన్ ఎ అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అయితే ఇది మోతాదుకు మించితే విషంగా మారే ప్రమాదముంది. మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్‌కు దారీ తీయవచ్చు. గుడ్లు, పాలు, ఛీజ్ వంటి పదార్ధాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. అదనంగా ట్యాబ్లెట్స్ తీసుకోవల్సిన అవసరం లేదు.
విటమిన్ బి 2 లేదా రిబోఫ్లేవిన్
శరీరానికి కావల్సిన 8 రకాల బి విటమిన్లలో ఇది చాలా ముఖ్యమైనది. శరీరంలోని ఆహారాన్ని అంటే కార్బోహైడ్రేట్స్‌ను ఫ్యూయల్ అంటే గ్లోకోజ్‌గా మార్చి..శక్తిని అందిస్తుంది. మనం రోజూ తినే వివిధ రకాల అల్పాహారంలో ఇది సమృద్ధిగా ఉంటుంది. అదనంగా విటమిన్ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవల్సిన అవసరం లేదు. ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనం ఏ మాత్రం లేదు.
విటమిన్ బి 6
మరో బి కాంప్లెక్స్ విటమిన్ ఇది. ఇది సాధారణంగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పౌల్ట్రీ, చేపల్లో సమృద్ధిగా లభిస్తుంది. దీర్ఘకాలం పాటు విటమిన్ బి 6 ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ డి2
విటమిన్ డి కోసం చాలా మంది ఏ మాత్రం అవగాహన లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఎండలో అలా బయటికి వెళ్లి తిరిగితే కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. అలా చేయకుండా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ డబ్బులు వృధా చేస్తుంటాం. విటమిన్ డి అనేది బాడీ కాల్షియంను గ్రహించేందుకు తోడ్పడుతుంది. తద్వారా ఎముకలు బలోపేతమవుతాయి. కండరాలు, నరాల బలానికి దోహదపడుతుంది. విటమిన్ డి కావాలంటే సూర్యరశ్మి ద్వారా పొందడమే ఉత్తమమంటున్నారు.
ఇలా ఇంకా చాలా విటమిన్స్‌ను మనం సహజ సిద్ఘంగా లభించే ఆహారపదార్ధాల్నించి కాకుండా విటమిన్ ట్యాబెట్ల్ రూపంలో తీసుకుంటుంటాం. అటు డబ్బులు దండగవడమే కాకుండా, లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటాం. ఈ కోవలో విటమిన్ ఇ, రెడ్ ఈస్ట్ రైస్, గమ్మీ విటమిన్స్, డీహైడ్రోఎపియాండ్రోస్టెరోన్, విటమిన్ సి, ఎంసీటీ ఆయిల్, హైడ్రాక్సీమిథైల్ బ్యుటిరేట్, ఎల్ ఆర్జినిన్, బీటా కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ సహజసిద్ధంగా ఆహారపదార్ధాల్లో లభించేవే.
Also read: Dandruff: ఏం చేసినా జుట్టులో చుండ్రు పోవడం లేదా? ఇలా ట్రై చేస్తే చుండ్రు మాయమైపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి