Glowing Skin: అధిక ఖర్చు లేకుండా సులువుగా మీ అందాన్ని పెంచుకోండి ఇలా..!
Beauty Tips For Glowing Skin: బ్యూటీ ఫుల్‌గా కనిపించాలిని చాలా మంది వివిధ రకాల బ్యూటీ టిప్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్‌తో అందంగా కనిపించిన వాటి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా లభించే వస్తువులతో అందాని పొందవచ్చు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Beauty Tips For Glowing Skin: కొందమంది ముఖం తెల్లగా, అందంగా ఉన్నప్పటికి దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం కారణంగా చర్మం నల్లగా మారుతుంది. దీని కారణంగా ముఖం కాంతిహీనంగా తయారవుతుంది. ఇటువంటి సమస్యతో బాధపడే వారు కొన్ని సులభమైన చిట్కాను పాటించడం వల్ల చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.
చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు ఇలా..
ఎండ వల్ల నల్లగా మారిన చర్మం: ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పాలు, అర టీ స్పూన్ అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి తెల్లగా మారుతుంది.
డెడ్ సెల్స్: శనగపిండి ఒక స్పూన్, రెండు స్పూన్ల నెయ్యి నీళ్లు కలిపి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి, ముఖం మెరుస్తుంది.
పెదవుల మృదువుగా: పెదాలు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా.. అయితే నెయ్యిని రోజు పడుకోనే ముందు తప్పకుండా పెదవులకు నెయ్యి రాసుకుంటూ ఉండాలి.
కీరాదోస: ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు గుడ్ బై చెప్పండి. కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి