Best Dal For Weight Loss: ప్రస్తుతం చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు శరీర బరువును తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే శరీర బరువును నియంత్రించుకోవడానికి ఆరోగ్య  నిపుణులు సూచించిన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పదార్థాలను డైట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో భాగంగా మైసూర్‌ పప్పును తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రోటీన్, తక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఈ పప్పును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా తీసుకోవడ వల్ల సులభంగా బరువు తగ్గుతారు:
1. మైసూర్‌ పప్పును నానబెట్టండి:

బరువు తగ్గాలనుకునేవారు మైసూర్‌ పప్పును తినడానికి కొన్ని గంటల ముందు నానబెట్టి తీసుకోవడం వల్ల అందులో పీచు పదార్థాలు పెరుగుతాయి. దీంతో మీ ఆకలి నియంత్రించి, శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇలా నానబెట్టి పప్పును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 


2. ఈ పప్పును తిన్న తర్వాత నీటిని తాగాల్సి ఉంటుంది:
బరువు తగ్గే క్రమంలో డైట్‌లో మైసూర్‌ పప్పును తీసుకున్న తర్వాత ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మీ శరీరంలోని మలినాలను తొలగించి శరీర బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. 


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం


పప్పును ఇలా ఉడికించాల్సి ఉంటుంది:
మైసూర్‌ పప్పును కేవలం తక్కువ వేడి మీద మాత్రమే ఉడికించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 


తక్కువ నూనె వేసుకోవాలి:
మసూర్ పప్పులో నూనె ఉంటుంది. కాబట్టి తప్పకుండా పప్పులను వినియోగించే క్రమంలో ఎక్కువ నూనె వేయకూడదు. నూనెకు బదులుగా నెయ్యి లేదా ఆవాల నూనెను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook