Best Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా
Best Juice Benefits: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో అద్భుతమైన విటమిన్లు, ఖనిజాలు పెద్దఎత్తున ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Juice Benefits: ఆరోగ్యానికి కావల్సిన మినరల్స్, ఖనిజాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, కూరగాయలు, పండ్లలో పెద్దఎత్తున ఉంటాయి. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ పండ్లలో అద్భుతమైంది బత్తాయి. ఇందులో ఉండే పోషకాలు వివిధ రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది.
బత్తాయిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. అందుకే బత్తాయిని పోషకాలకు పవర్ హౌస్ గా చెప్పవచ్చు. రోజూ క్రమం తప్పకుండా బత్తాయి జ్యూస్ లేదా బత్తాయి తినడం వల్ల ఆరోగ్యపరంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. అంతేకాకుండా విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు దూరమౌతాయి.
ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది. అందుకే బత్తాయి జ్యూస్ తాగినప్పుడు ఎవరికైనా సరే ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. బత్తాయి జ్యూస్ తాగడం వల్ల ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉపయోగపడుతుంది. అందుకే డైట్ ప్రక్రియలో ఇది అద్భుతంగా దోహదం చేస్తుంది.
బత్తాయి రోజూ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి దూరమౌతుంది. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పెరగడంతో సీజనల్ వ్యాధులు దూరమౌతాయి.
Also read: Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.