Appetisers: ప్రకృతి మనకు చాలా అందిస్తుంటుంది. ప్రకృతిలో లభించే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రత్యేకత. ఆకలిని పెంచే అద్భుతమైన పదార్ధాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకలి అనేది ఆరోగ్యానికి ప్రదాన లక్షణం. ఆకలేయడం లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేదనుకోవాలంటారు వైద్యులు. ఆకలి బాగా పెరిగినా, లేదా తగ్గినా అనారోగ్యానికి సంకేతమే. ఆకలి తక్కువగా ఉండి..ఏది  తినాలన్పించదు కొందరికి. వీరిలో ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలుంటాయి. సహజమైన ఔషధాల ద్వారా ఆకిలిని పెంచుకోవచ్చు. ఇంట్లో లభించే పదార్ధాలతోనే ఆకలిని పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.


ఆకలిని పెంచే శక్తవంతమైన పదార్ధాల్లో అల్లం కీలకమైంది. అజీర్థి సమస్యల్ని దూరం చేస్తుంది. పచ్చి అల్లం తింటే ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రోజుకు 3-4 సార్లు అల్లం టీ తాగడం ద్వారా లాలాజలం శక్తివంతమై..జీర్ణక్రియ రసాల ఉత్పత్తి పెరిగి..ఆకలి పెరుగుతుంది. ఆకలిని పెంచే మరో పదార్ధం నిమ్మరసం. నిమ్మరసాన్ని సలాడ్‌లో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది. రోజుకు రెండు గ్లాసుల నిమ్మరసం తాగినా మంచిదే.


ఆకలిని పెంచే ఉత్ప్రేరకాలలో చింతపండు కూడా ఒకటి. రోజూ తయారు చేసుకునే వంటకాలలో చింతపండు గుజ్జు కలుపుకుంటే..ఆకలి పెరుగుతుంది. అయితే తగిన మోతాదులోనే దీనిని వాడుకోవాలి. ఇక కొత్తిమీర ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. సహజసిద్దంగా ఆకలి పెంచుతుంది. పరగడుపున కొత్తిమీర రసం తాగితే చాలా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా లభించే ఉసిరితో కూడా ఆకలి పెరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా..కాలేయం విషపూరితం కాకుండా చేస్తుంది. ఆకలి పెంచుతుంది. 


ఇక నల్ల మిరియాలు, యాలుక్కాయలతో కూడా ఆకలి పెంచుకోవచ్చు. మిరియాల్ని కూరల్లో కలుపుకోవడం ద్వారా, యాలుక్కాయల్ని రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవడం ద్వారా ఆకలి పెంచుకోవచ్చు. దానిమ్మ పండు రసం కూడా ఆకలి పెంచే ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 


Also read: Acidity Relief Remedies: ఎసిడిటీ సమస్యను దూరం చేసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook