Weight Loss Drink: బరువు వేగంగా తగ్గాలంటే గ్రీన్ టీ వర్సెస్ గ్రీన్ కాపీ, ఏది మంచిది
Weight Loss Drink: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెద్ద సవాలుగా మారింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. గ్రీన్ టీ తాగమని లేదా గ్రీన్ కాఫీ తాగమని సూచిస్తుంటారు. ఈ రెండింట్లో బరువు తగ్గేందుకు ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Weight Loss Drink: బరువు తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఆశ్రయిస్తుంటారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వస్తువులతో డైట్ కంట్రోల్ ప్రక్రియ చేస్తుంటారు. ఇందులో భాగంగా గ్రీన్ టీ అందరికీ తెలిసిందే. కొత్తగా గ్రీన్ కాఫీ వినియోగంలో వచ్చింది. రెండూ బరువు తగ్గించేందుకే అయినప్పుడు ఏది బెటర్ అనేది పరిశీలిద్దాం.
గ్రీన్ టీ అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, వెయిట్ లాస్ కోసం చాలా కాలంగా వాడుకలో ఉన్న విధానం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇందులో ఉండే కెటోచిన్ అనే పోషకం బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొవ్వును తగ్గించేందుకు, మెటబోలిజంను వేగవంతం చేసేందుకు అద్బుతంగా సహాయం చేస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే కెఫీన్ అలసటను దూరం చేసి ఉత్తేజం కల్గిస్తుంది. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కావల్సినంత అందుతాయి. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.
కొత్తగా ట్రెండ్ అవుతున్న గ్రీన్ కాఫీ
గ్రీన్ కాఫీ అనేది ఇటీవలి కాలంలో బరువు తగ్గించేందుకు వినియోగంలో వచ్చింది. ఇందులో కాఫీ బీన్స్ రోస్ట్ చేయరు. దాంతో ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ అలాగే ఉంటుంది. అదే రోస్ట్ చేయడం వల్ల ఈ యాసిడ్ పోతుందంటారు. ఈ యాసిడ్ బరువు తగ్గించేందుకు దోహదపడే అద్భుతమైన కారకం. ఇక కెఫీన్ అయితే ఎనర్జీ ఇస్తుంది. గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ కావల్సినంతగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
గ్రీన్ టీ వర్సెస్ గ్రీన్ కాఫీ ఏది బెటర్
గ్రీన్ టీ లేదా గ్రీన్ కాఫీ ఏది మంచిదనే సందిగ్ధం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే బరువు తగ్గించే ప్రక్రియకు గ్రీన్ టీ చాలాకాలంగా వాడుకలో ఉంటే గ్రీన్ కాఫీ కొత్తగా ట్రెండింగులో వచ్చింది. గ్రీన్ టీలో ఉండే కెటోచిన్ మెటబోలిజం వేగవంతం చేస్తుంది. గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. కేవలం మెటబోలిజం మాత్రమే పోకస్ చేయాలంటే గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్. అదే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో రావాలంటే గ్రీన్ కాఫీ మంచి ఆప్షన్. అయితే ఈ రెండింటిలో ఏది వాడినా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కెఫీన్ కారణంగా నిద్ర లేమి సమస్య రావచ్చు. అంతేకాకుండా రోజూ వ్యాయామం, హెల్తీ డైట్ కూడా అవసరమౌతాయి.
Also read: Heavy Bleeding Problem: పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ ఉంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook