Summer Drinks: వేసవి దాహం తాపాన్ని తీర్చే అద్భుతమైన డ్రింక్స్ ఇవే
Summer Drinks: వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా కూల్ చేయాల్సిన అవసరముంది. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు రుచికరమైన, రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..
Summer Drinks: ఎండల తీవ్రత, వడగాల్పుల నేపధ్యంలో శరీరాన్ని రీ హైడ్రేట్ చేసుకోవల్సిన అవసరముంది. వేసవిలో వాటర్ ఇన్‌టేక్ ఎక్కువగా ఉండాలి. ఈ క్రమంలో వేసవి దాహాన్ని తీర్చే కొన్ని ప్రత్యేకమైన సమ్మర్ డ్రింక్స్ సేవిస్తే దాహం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ప్రయోజనం కలుగుతుంది.
మామిడి పన్నా
పండ్ల రారాజు వేసవి సీజనల్ ఫ్రూట్ మామిడితో చేసే ఓ రకమైన జ్యూస్ ఇది. ఆమ్ పన్నాగా పిలుస్తారు. మామిడి గుజ్జు, జీలకర్ర, పుదీనా ఆకులతో కలిపి చేస్తారు. దేశంలో ఇది చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందిస్తుంది. తక్షణం మీ బాడీని రీ హైడ్రేట్ చేస్తుంది.
మామిడి పన్నా తయారీ ఇలా
మామిడి పన్నా తయారీకు అరకిలో పచ్చి మామిడికాయలు, ఆరకప్పు పంచదార, 2 చెంచాల సాల్ట్, 2 చెంచాల రాక్ సాల్ట్, రోస్ట్ చేసిన జీలకర్ర 2 చెంచాలు, బాగా తరిగిన పుదీనా ఆకులు, రెండు కప్పుల నీళ్లు అవసరమౌతాయి.
ముందుగా మామిడి కాయల్ని బాగా నీళ్లలో ఉడికించాలి. తొక్క రంగు మారేంతవరకూ ఉడికించాలి. ఆ తరువాత చల్లార్చిన తరువాత తొక్క తీసి గుజ్జు వేరు చేయాలి. ఈ గుజ్జులో రెండు కప్పుల నీళ్లు కొద్గిగా ఐస్, జీలకర్ర, పుదీనా వేసి కలపాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన మామిడి పన్నా సిద్ధం.
ఐస్డ్ జల్‌జీరా
వేసవిలో మిమ్మల్ని కూల్ చేసే మరో అద్భుతమైన డ్రింక్ ఇది. చింతపండు గుజ్జు 125 గ్రాములు, పుదీనా ఆకులు, జీలకర్ర అర టీ స్పూన్, రోస్టెడ్ జీలకర్ర అర టీ స్పూన్, 50 గ్రాముల బెల్లం, 4 టీ స్పూన్స్ రాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింగర్ సాల్ట్, 3-4 చెంచాల నిమ్మరసం, గరం మసాలా, చిల్లి పౌడర్, నీళ్లు కావాలి. అన్ని పదార్ధాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయడమే.
మేంగో లస్సీ
మ్యాంగో లస్సీ వేసవి తాపం తీర్చే మరో అద్భుతమైన సమ్మర్ డ్రింక్. మామిడి గుజ్జు, వెన్నతో కూడిన పెరుగుతో చేస్తారు. కొద్దిగా పంచదార, కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే రుచి బాగుంటుంది. ఆరోగ్యపరంగా చాలా మంచిది.
బార్లీ నీళ్లు
వేవవిలో అన్నింటికంటే అద్భుతమైంది బార్లీ నీళ్లు. బార్లీ అనాదిగా వినియోగిస్తున్న అద్భుతమైన ధాన్యం. బార్లీ కాచుకుని తాగితే చాలా మంచి ప్రయోజనాలున్నాయి. బార్లీ నీళ్లలో కొద్దిగా ఉప్పు, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే ఇంకా మంచిది.
Also read: Sleep Disorder: శరీరంలో పొటాషియం లోపిస్తే అంత ప్రమాదకరమా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook