Betel Leaf Benefits: శోభనం గదిలో పురుషులు తమలపాకులు (పాన్) ఎందుకు తింటారో తెలుసా?
Betel Leaf Benefits: తమలపాకులను మన దేశంలో నిత్యం పూజల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో కచ్చితంగా వాడుతుంటారు. ఈ పాన్ వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. తమలపాకులను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాన్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Betel Leaf Benefits: భారతదేశంలో తమలపాకులను ప్రతిరోజూ అధిక పరిమాణంలో వినియోగిస్తారు. గుడిలో, ఇంట్లోని పూజా మందిరాల్లో, శుభకారాల్లో ఇలా చాలా వాటిలో తమలపాకులను వినియోగిస్తారు. తమలపాకులను చాలా పవిత్రంగా భావిస్తారు. పూర్వపు రోజుల్లో తమలపాకులను ప్రతిరోజూ తినేవారట. పూజల్లోనే కాకుండా వివాహాది శుభకార్యాల విందుల్లోనూ తమలపాకులతో చుట్టిన పాన్ ను అతిథులకు ఇస్తుంటారు. తమలపాకుల రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుస్తోంది. అయితే ఈ పాన్ ను పెళ్లి తర్వాత శోభనం గదిలో ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల పురుషునికి అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అయితే పాన్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహిత పురుషుల్లో శక్తి కోసం..
తమలపాకుతో చేసిన పాన్ తినడం పురుషుల లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిజానికి.. తమలపాకులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ సెప్టిక్, డియోడరెంట్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల పాన్ తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది. దీని కారణంగా పురుషులలో లిబిడో పెరుగుతుంది. ఇది పురుషులలో లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. పెళ్లయిన మగవారు రాత్రి పడుకునే ముందు దీన్ని తినాలని పెద్దలు సూచించడానికి కారణం ఇదే.
జీర్ణవ్యవస్థ మెరుగు
తమలపాకులను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత పాన్ తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ సక్రమంగా జరుగుతుందని పెద్దలు సూచిస్తుంటారు. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుందట. భోజనం చేసిన తర్వాత పాన్ తినడం వల్ల కడుపునొప్పి, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భోజనం తర్వాత తమలపాకులను తినడానికి కారణం ఇదే కావొచ్చు.
గాయానికి మందుగా..
తమలపాకులను గాయాలకు మందుగా కూడా ఉపయోగిస్తారు. ఆ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ మూలకం ఉండడం కారణంగా గాయన్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. మీలో ఎవరికైనా గాయమైతే, తమలపాకుల రసాన్ని తీసి గాయంపై పూసి.. దానిపై తమలపాకులతో కప్పి.. కట్టు కట్టాలి. కొన్ని రోజుల తర్వాత ఆ గాయం పూర్తిగా మానిపోతుంది.
మలబద్దకాన్ని దూరం చేస్తుంది..
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఇది మన చెడిపోయిన జీవనశైలికి సంబంధించిన సమస్య. మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే.. భోజనం తర్వాత తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంతో పాటు ఆ ఆకును ముక్కలుగా చేసి ఓ గ్లాసు నీటిలో రాత్రంగా అలాగే ఉంచి.. ఉదయాన్ని తాగేయాలి. తర్వాత రోజు ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మీరు దీని నుంచి కచ్చితంగా మేలు జరుగుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా ఇంటి చిట్కాలు, సాధారణ నమ్మకాలు ఆధారంగా గ్రహించబడింది. వీటిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Low BP Symptoms, Remedies: లో బీపీ లక్షణాలు ఏంటి ? ఎలా బయటపడాలి ?
Also Read: Drinking Fruit Juice: ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా ? ఐతే రిస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.