Bilva Patra Health Benefits: బిల్వపత్రం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వీటిని పూజలో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివపూజలో బిల్వ పత్రాన్ని వినియోగిస్తారు. మూడు ఆకులు కలిపి ఉండే ఈ బిల్వ పత్రం మొక్కను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఈ చెట్టుకు బిల్వ పండు కూడా పెరుగుతుంది. అయితే, బిల్వ పత్రం పూజ పరంగానే కాకుండా అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు బిల్వ పత్రం మన డైట్లో చేర్చుకోవడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇమ్యూనిటీ బూస్ట్‌..
ఇమ్యూనిటీ వ్యవస్థ మన శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇది మందగిస్తే తరచూ రోగాల బారిన పడతారు. బిల్వ పత్రం మీ డైలీ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల మంచిది. పరగడపున బిల్వపత్రాలను తీసుకుంటే ఇందులోని విటమిన్‌ సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఈ పత్రం జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే బిల్వ పత్రాన్ని తీసుకోండి.


ఇదీ చదవండి: క్రాన్బెర్రీ జ్యూస్‌ తరచూ తీసుకుంటే మహిళలకు వరం.. ఈ ప్రాణాంతక వ్యాధులకు చెక్‌..


గుండె ఆరోగ్యం..
బిల్వ పత్రం గుండెకు కూడా మేలు చేస్తుంది. దీన్ని మీ డైలీ మార్నింగ్‌ రొటీన్లో పరగడుపున చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే బిల్వ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. బిల్వ పత్రం డైట్లో ఉంటే హార్ట్‌ అటాక్‌, హై బీపీ సమస్యలు తగ్గిస్తుంది. పరగడుపున బిల్వ పత్రం ఆకులను తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యూలర్‌ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.


డయాబెటీస్‌కు వరం..
బిల్వ పత్రం డయాబెటీస్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. డయాబెటీస్‌ బారిన పడ్డవారు బిల్వ పత్రం డైట్లో చేర్చుకోవాలి. ఇది ఇన్సూలిన్‌ స్థాయిలను పెంచి కాలేయంలోకి గ్లూకోజ్‌ను  నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడంలో బిల్వ పత్రం సహాయపడుతుంది. ఖాళీ కడుపున డయాబెటీస్‌తో బాధపడేవారు తమ డైట్లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగతాయనే భయమే ఉండదు.


ఇదీ చదవండి: హోటళ్లలో తిన్న ఆహారమేకాదు.. ఇలా చేస్తే ఇంట్లో వండుకున్నా అనారోగ్యం బారినపడతారు..


యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు..
బిల్వ పత్రంలో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎన్నో ఔషధాల్లో కూడా బిల్వ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది రెండూ బ్యాక్టిరియల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా మంచి రెమిడీగా పనిచేస్తుంది. బిల్వ పత్రం ఆరోగ్యపరంగా దివ్వౌషధం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి