COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Black Cardamom Benefits: ప్రతి ఒక్కరూ వంటలు రుచిని పెంచేందుకు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువగా మిర్యాలతో పాటు యాలకులను వాడుతూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే ఆకుపచ్చ రంగులో కలిగిన యాలకులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మార్కెట్లో నల్ల యాలకులు కూడా లభిస్తాయి. వీటివల్ల సాధారణంగా లభించే యాలకుల కంటే పది రెట్లు ఎక్కువగా మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని కొందరు మార్కెట్లో సిట్ర‌స్, యూక‌లిప్ట‌స్ పేర్లతో కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా ఆయుర్వేద నిపుణులు వివిధ రకాల రెమెడీస్ లో వినియోగిస్తారని సమాచారం. ఈ నల్ల యాలకుల్లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులను సైతం సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.



నల్ల యాలకులు యాంటీ వైరస్ లక్షణాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. దీంతోపాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఈ నల్ల యాలకు సహాయపడతాయి. దీంతోపాటు శరీరంలోని పెరుగుతున్న మళినాలతో పాటు విష పదార్థాలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గుండె పనితీరును కూడా మెరుగుపరిచేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు


అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా నల్లయాలకులను ప్రతిరోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ఉండే గుణాలు బీపిని కూడా సులభంగా అదుపులో ఉంచుతాయి అంతేకాకుండా ఎలాంటి గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయని వారంటున్నారు. అలాగే జీర్ణ క్రియ సమస్యల కారణంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అల్సర్ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఈ నల్ల యాలకుల తో తయారు చేసిన పొడిని పాలలో కలుపుకొని తాగడం వల్ల గొప్ప రిలీఫ్ పొందుతారు. నల్ల యాలకులను నమిలి తినడం వల్ల కూడా బోలెడు లాభాలు ఉన్నాయి. దీనివల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


ఈ నల్లయాలకుల్లో లభించే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు ఎక్కువగా నలయాలకులను వినియోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్ ఇతర క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారు. అలాగే చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట వంటి సమస్యలను కూడా ఈ నల్లయాలకు సులభంగా దూరం చేస్తాయి.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి