Black Coffee With Honey For Weight Loss: కాఫీ తాగడం చర్మానికి అసలు మంచిది కాదు..ఇందులో అధిక మోతాదులో కెఫీన్ లభిస్తుంది. ప్రతి రోజు కాఫీ తాగే వారిలో రక్తపోటు సమస్యలు సులభంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కాఫీలో పాలు, చక్కెర అధిక పరిమాణంలో కలిపి తీసుకోవడం వల్ల తీవ్ర మధుమేహం సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. బరువు తగ్గే వారు ఈ కాఫీని ప్రతి రోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారా? అనే ప్రశ్న అందరికీ రావచ్చు. ఇలాంటి వారి కోసం మేము మంచి సమాచారాన్ని తీసుకువచ్చాం.. బరువు తగ్గాలనుకునేవారు కాఫీ తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గాలనుకునేవారికి బ్లాక్‌ కాఫీ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు బరువు తగ్గే క్రమంలో బ్లాక్‌ కాఫీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి కాఫీలో తేనెను కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుందట. శరీరం కూడా సులభంగా ఫిట్‌గా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


బ్లాక్ కాఫీ బరువును ఎలా తగ్గిస్తుందో తెలుసా?:
బరువు తగ్గడానికి కాఫీలో ఉండే కెఫిన్‌ బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో న్యూరోట్రాన్స్‌మిటర్‌లను ప్రేరేపించి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు కొవ్వు కణజాలం ప్రభావం చూపుతుంది. కాబట్టి తీవ్ర కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు కూడా కాఫీని తీసుకోవచ్చు. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


బ్లాక్ కాఫీలో లభించే పోషకాలు ఇవే:
బ్లాక్ కాఫీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్-బి2, విటమిన్-బి3, విటమిన్-బి1, , విటమిన్-బి5తో పాటు ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలేట్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు రెండు కప్పుల చొప్పున కాఫీని తీసుకోవడం వల్ల మైండ్‌ రిలీఫ్ అవుతుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


తేనె కలుపుకుని తాగితే రెట్టింపు లాభాలు?
బ్లాక్ కాఫీలో తేనె కలుపుకుని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో స్టోర్డ్ అనే పోషకం అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయి చెడు కొవ్వును సులభంగా కరిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు వేగంగా తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తేనె కలిపిన కాఫీని తాగాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook