శరీరంలో తలెత్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు కిచెన్‌లోనే పరిష్కారముంది. వివిధ మసాలా, తాలింపు దినుసులతో చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందులో ఒకటి నల్ల జీలకర్ర. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలోని ప్రతి వంటింట్లో కచ్చితంగా లభించేది జీలకర్ర. జీలకర్ర ఉపయోగం అంత విస్తృతంగా ఉంటుంది. తినే ఆహారం రుచిని పెంచుతుంది. జీలకర్ర కేవలం రుచి కోసమే కాదు..ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయ. జీలకర్రతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. ఈ క్రమంలో జీలకర్ర ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. జీలకర్ర సేవించడం వల్ల కడుపుకు సంబంధించిన పలు ఇబ్బందులు దూరమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. జీలకర్రలో నల్ల జీలకర్ర మరింత లాభదాయకం. సాధారణ జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రతో ప్రయోజనాలు ఎక్కువ. 


నల్ల జీలకర్ర లాభాలు


చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇటీవల చాలామంది కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారు. నల్ల జీలకర్ర నీళ్లతో ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తంది. నల్ల జీలకర్రతో శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


జీర్ణక్రియలో ఇబ్బంది ఉన్నప్పుడు శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా శరీరం బరువు పెరుగుతుంది. నల్ల జీలకర్ర కొవ్వును కరిగిస్తుంది. మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తుంది.


నల్ల జీలకర్ర నీళ్లు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో దోహదపడతాయి. మీ ఇమ్యూనిటీని పటిష్టపరుస్తుంది. సీజనల్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. జలుబు, దగ్గు సమస్యలున్నప్పుడు జీలకర్ర తీసుకుంటే వేగంగా ఉపశమనం కలుగుతుంది. నల్ల జీలకర్రతో శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు, బ్రోంకైటిస్, ఎలర్జీ దూరమౌతాయి.


Also read: How To Lose Weight: బరువు తగ్గే క్రమంలో ఉదయం పూట ఇలా చేస్తున్నారా.. ఇక అంతే సంగతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook