3 Kg Weight Loss In 7 Days Diet Plan: బరువు తగ్గడం ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసింది. ఊబకాయం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు కూడా చేస్తారు. అంతేకాకుండా మరికొందరైతే రాత్రి పూట ఆహారాలు తీసుకోవడం మానుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డార్క్‌ ఫుడ్స్‌ బరువు తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
బ్లాక్ రైస్:

బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో ప్రతి రోజు బ్రౌన్ రైస్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి ఆంథోసైనిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారు. బ్లాక్‌ రైస్‌లో ఫైబర్‌ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఈ రైస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణలు తెలుపుతున్నారు. 


నల్ల వెల్లుల్లి:
నల్ల వెల్లుల్లి ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 


Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు


బ్లాక్ టీ:
బ్లాక్ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలను తగ్గించి బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలో కణాల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. 


బ్లాక్ బెర్రీలు:
బ్లాక్‌ బెర్రీలు ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాల శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో తప్పకుండా ప్రతి రోజు డైట్‌లో వీటిని చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook