Hair Mask for Black Hair: ఉల్లిపాయలను చాలా మంది వంటకాల రుచిని పెంచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని తినడం వల్ల శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా రకాలుగా సహాయపడుతుంది. జుట్టుకు ఉల్లిపాయల మిశ్రమాన్ని వినియోగించడం వల్ల జుట్టు రాలడమేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే జుట్టుకు ఉల్లిపాయ మిశ్రమాన్ని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టుకు ఉల్లిపాయ మిశ్రమాన్ని వినియోగించడం వల్ల జుట్టుకు సల్ఫర్ లభించి జుట్టును ఒత్తుగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. జుట్టుకు ఉల్లిపాయను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి.


జుట్టుకు ఎలా ఉల్లిపాయను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం:
ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం జుట్టు వినియోగించవచ్చు. ఇందులో జుట్టుకు కావాల్సిన చాలా రకాల గుణాలు లభిస్తాయి. ఈ ఉల్లి రసాన్ని ఇంట్లో తయారు చేసుకోవడానికి ముందుగా 2 ఉల్లిపాయలను తీసుకోండి. వీటిని నుంచి రసం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రసాన్ని తీసుకుని జుట్టుకు అప్లై చేసి చేతులతో తేలిక పాటి మసాజ్‌ చేస్తే జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు(5 నుంచి 12 నిమిషాలు) ఆరనివ్వాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు వేగంగా పెరుగుతుంది.


Also Read: Sugar Level: మధుమేహాన్ని, రక్త పోటును తగ్గించే అద్భుతమైన ఆకులు ఇవే, వీటితో ఈ వ్యాధులన్నీ చెక్‌!


ఉల్లిపాయ హెయిర్ మాస్క్:
జుట్టుకు ఉల్లిపాయ, కలబంద హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు రాలడంతో పాటు నల్లగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. ఉల్లిపాయను కట్ చేసి తురుముకోవాలి. కాటన్ క్లాత్‌తో ఫిల్టర్ చేసి ఉల్లిపాయ రసాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే రసంలో 2 చెంచాల అలోవెరా జెల్ కలపండి. ఇలా రెండింటిని బాగా మిక్స్‌ చేయాలి. అందులోనే  3 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసిన హెయిర్ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేస్తే చాలా జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook