Black Salt For Weight Loss in 20 Days: పెరుగుతున్న శరీర బరువును నియంత్రించడానికి తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు డైట్‌ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఫలితం పొందలేకపోతే తప్పకుండా పలు ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం బరువు తగ్గడానికి ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల తీవ్ర  అలసటతో పాటు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాల్లో బ్లాక్‌ సాల్ట్‌ వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బ్లాక్‌ సాల్ట్‌ను వినియోగించడం వల్ల ఎలా బరువు తగ్గొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ సాల్ట్‌తో బరువు తగ్గడం ఎలా..?


బ్లాక్ సాల్ట్ వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ బ్లాక్ సాల్ట్ తినడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ సాల్ట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ సోడియం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో వాపుల సమస్యల సులభంగా దూరమవుతాయి. దీంతో బ్లాక్‌ సాల్ట్‌ని ఉపయోగించడం వల్ల ఉదర సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరంలో లిపిడ్‌లను కరిగించడానికి సహాయపడుతుంది. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ తగిన పరిమాణంలో మాత్రమే నిల్వ ఉంటుంది.


బ్లాక్ సాల్ట్ ప్రయోజనాలు:


బ్లాక్ సాల్ట్ క్రమం తప్పకుండా వినియోగిస్తే నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శరీర ఒత్తిడిని తగ్గించి  ఆందోళన హార్మోన్లను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెల్లో మంటను నియంత్రించడానికి సహాయపడుతుంది.


బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, ఒత్తిడి మరియు ఆందోళన హార్మోన్లను సడలించడంలో సహాయపడుతుంది, గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.


బరువు తగ్గడానికి బ్లాక్ సాల్ట్ ఎలా ఉపయోగించాలి..?


ఉదయం నిద్ర లేవగానే పావు చెంచా బ్లాక్ సాల్ట్ ను ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగాలి. అంతేకాకుండా గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అయితే ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు


Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook