Blood Circulation Improve Foods: శరీరంలో మనం తీసుకునే ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్త సరఫరాను మెరుగుపరిచే ఆహారాలు.  ఈ ఆహారాలు ముఖ్యంగా ఆక్సిజన్ ఇతరుల ఖనిజాలు రవాణా చేసే విధంగా ఉండాలి. శరీరంలోని విష పదార్థాలు సులభంగా బయటికి పంపించాలి. రక్తం ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను సెల్ఫ్ కి సరఫరా చేస్తాయి. దీంతో మన శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది మనం తీసుకునే ఆహారం వల్ల ఇలా జరుగుతుంది. లేకపోతే రక్త సరఫరా లో సమస్యలు వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరంలో రక్తం ప్రసరణను వేగవంతం చేసి కొన్ని ఆహారాలు ఉన్నాయి మన డైట్ లో చేర్చుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కేటాచిన్స్ రక్తనాళాలకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. అంతేకాదు గ్రీన్ టీ వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.


బీట్రూట్ జ్యూస్..
బీట్రూట్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది రక్తంలో కలిసి రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీట్రూట్ ను రెగ్యులర్గా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది బ్లడ్ సరఫరా మెరుగు పడుతుంది.


ఇదీ చదవండి: రోజంతా హైడ్రేషన్ అందించే 5 రకాల పండ్లు.. మీ డైట్ లో ఉన్నాయా?


అల్లం టీ..
ఈజీగా రక్త సరఫరాకు మన డైట్ లో చేర్చుకోవడంకి ఏదైనా ఉంది అంటే అది అల్లం టీ. ఇది కూడా సులభంగా రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు బ్లడ్ సర్కిలేషన్ను మెరుగుపరుస్తుంది. ఇది వాపు సమస్యను తగ్గించి రక్తనాళాలకు హాయినిస్తుంది. అల్లం టీ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్త సరఫరా ఈజీగా జరుగుతుంది.


పసుపు టీ
పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి ఆర్టేరీ బ్లాకేజ్ రాకుండా టర్మరిక్ టీ కాపాడుతుంది. పసుపును పాలలో వేసి తీసుకోవడం వల్ల పనిచేస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.


ఇదీ చదవండి: మీ బొక్కలు బలంగా ఉండాలంటే ఈ 5 తినాల్సిందే.. ఈరోజు నుంచే తినండి..


సిట్రస్ పండ్లు..
సీట్రస్ పండ్లు అయినటువంటి ఆరెంజ్, గ్రేప్, నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్త సరఫరాను సులభంగా మెరుగుపరుస్తాయి. రక్తాన్ని పలుచగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లలో ఉండే విటమిన్ సి రక్తనాళాలను బలంగా మారుస్తాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది.


దానిమ్మ జ్యూస్..
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అనే పాలీఫినల్స్ ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేయడంలో ప్రేరేపిస్తుంది. రక్తనాళాలను ఉపశమనం ఇస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది దానిమ్మ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటే రక్త సరఫరా మెరుగుపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి