Blood pressure : ఏ మందులు వాడకున్నా ఈ 8 మూలికలు మీ రక్తపోటును నేచురల్ గా తగ్గిస్తాయి.
Blood pressure control Herbs : ఈ మధ్యకాలంలో రక్తపోటు అనేది సాధారణ సమస్య, ప్రతి ముగ్గురులో ఒకరికి రక్తపోటు సమస్య వస్తుంది. ఇది హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. బీపీతో బాధపడేవారు మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
Blood pressure control Herbs : ఈ మధ్యకాలంలో రక్తపోటు అనేది సాధారణ సమస్య, ప్రతి ముగ్గురులో ఒకరికి రక్తపోటు సమస్య వస్తుంది. ఇది హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. బీపీతో బాధపడేవారు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ జీవన శైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది, అయితే మందులు వాడకుండా మన ఇంట్లో ఉండే కొన్ని మూలికలతో సులభంగా హై బీపీని తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా? ఆ మూలికలు మసాలాలు ఏంటో తెలుసుకుందాం.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో బ్లడ్ ప్రెజర్ లెవెల్ తగ్గిపోతాయి తాజా అల్లంతో మన వంటలు చేసుకోవాలి. అంతేకాదు రకరకాల కూరల్లో, డ్రెస్సింగ్ లో కూడా ఉపయోగించవచ్చు దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.
అల్లం..
అల్లం వంటింటి మసాలా దీంతో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.అల్లం మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. అల్లం బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అల్లం లో టీ తయారు చేసుకోవచ్చు. స్మూతీస్ కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
పసుపు..
పసుపు లో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు పసుపు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది పసుపును కూరల్లో వేసుకొని తీసుకుంటాం. ఇది సూప్స్ స్మోథీలో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మన వంటింటి మసాలా.
దాల్చిన చెక్క..
డయాబెటిస్ వారికి దాల్చిన చెక్క నేచురల్ ఇన్సులిన్ అంటారు. ఇది షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అంతేకాదు దాల్చిన చెక్కను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది, దాల్చిన చెక్కను ఫ్రూట్స్ సలాడ్స్ ,ఓట్ మిల్ లో కలిపి తీసుకోవచ్చు. ఇది మనం ఆహారాల్లో కూడా వినియోగిస్తాం. దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. బ్లడ్ ప్రెషర్ నిర్వహిస్తుంది.
సబ్జా సీడ్స్..
సబ్జా సీడ్స్ లో యుగనల్ ఉంటుంది ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగకుండా నిర్వహిస్తుంది. సబ్జా సీడ్స్ ని కూడా సలాడ్స్ సాండ్విచ్ , డిషెస్ లో కలిపి తీసుకోవచ్చు ఇది వేడి నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి:విటమిన్ D పుష్కలంగా ఉండే 7 గింజలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయా?
సెలరీ సీడ్..
సెలరీ సీడ్‌లో రక్తనాళాలకు హాయిని ఇచ్చే గుణాలు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ రక్తప్రసరణను మెరుగుపరిస్తాయి రక్త పోటును తగ్గిస్తుంది. సెలరీ సీడ్స్ సూప్స్ లో సలాడ్స్ లో వేసుకొని తీసుకోవచ్చు.
యాలకులు..
యాలకులు కూడా మరొక మసాలా. ఇది హై బీపీని తగ్గిస్తుంది. నా సహజ సిద్ధంగా బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది గుండె ఆరోగ్యానికి మంచిది యాలకులను వివిధ వంటలు ఉపయోగిస్తామ అంతేకాదు వీటిని స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి:కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మీ ఇంటి కిచెన్లోనే 7 మెడిసిన్స్ ఉన్నాయి..
కైని పెప్పర్..
కైని పేపర్లో క్యాప్సిన్ ఉంటుంది ఇది బ్లడ్ రక్తనాళాల్లో అని మెరుగుపరిచే రక్త ప్రసరణ పెంచుతుంది అంతేకాదు రక్తపోటును తగ్గిస్తుంది. పెప్పర్ను మనం వంటలో వినియోగించాలి సాస్ మ్యారినేట్స్ లో వేసుకుంటే ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి