Body Cool Herbs in Summer: ఎండకాలం శరీర ఉష్ణోగ్రత తరచుగా పెరుగుతుంది. దీంతో హీట్‌, చర్మంపై దద్దుర్లు వస్తాయి. అంతేకాదు, వేసవిలో ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక సవాలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మన వడదెబ్బ వంటి అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. తద్వారా హీట్‌ స్ట్రోక్‌ నుంచి బయటపడతారు. మీ శరీరం కూల్ గా మారిపోతుంది. ఇంటి కిచెన్లో ఉండే కొన్ని మూలికలతో సులభంగా వేసవి వ్యాధుల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోంపు..
సోంపు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు ఇది మంచి మౌత్‌ ఫ్రెషనర్‌ కూడా. అయితే, వేసవి వేడిని తరిమికొట్టడానికి కూడా సోంపు ఎంతగానో సహాయపడుతుంది. సాధారణంగా సోంపు చల్లదనాన్నిస్తుంది. సోంపు శరీరంలోని విషపదార్థాలను బయటకు తరమడానికి సహాయపడుతుంది. సోంపు మన అందరి ఇళ్లలో ఉంటుంది. సోంపు ఉండే కొన్ని రకాల జ్యూసులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 


ఇదీ చదవండి: షుగర్ పేషంట్లకు 7 బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్స్‌.. రక్తంలో చక్కెరస్థాయిలను పెరగనివ్వవు..
చమోమిలే..
చమోమిలే కూడా వేసవి ఎండ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది ఒక మూలిక శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అంతేకాదు చమోమలే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . చమోమిలే ఉండే టీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వేసవి వేడిమికి చెక్‌ పెడుతుంది చమోమిలే. 


పుదీనా..
పుదీనా సాధారణంగా చల్లని తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే పుదీనాను ఆహారంలో చేర్చుకోవచ్చు. పుదీనా కడుపు మంటకు మంచి రెమిడీ. పుదీనాలో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.. పుదీనాను రైతా, షర్బత్‌గా ఉపయోగించవచ్చు.


ఇదీ చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ 5 మొక్కలు మీ బెడ్‌రూంలో ఉండాల్సిందే..


కొత్తిమీర..
వేసవి వేడికి హాయినిచ్చే మంచి హోం రెమిడీ కొత్తిమీరా. కొత్తిమీరను మీ ఆహారంలో చేర్చుకోవాలి. కొత్తిమీర కూడా చల్లదనాన్నిస్తుంది. కొత్తిమీరా జీర్ణక్రియకు మంచిది. మజ్జిగలో కొత్తిమీరా వేసుకుని తీసుకుంటారు. అంతేకాదు దీంతో కొత్తమీరా చట్నీ తయారు చేసుకోవచ్చు. వేసవి వేడిమికి హాయినిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter