Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!
Body Detox Drink: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది చెడు ఆహారాన్ని తింటున్నారు. దీంతో శరీరంలో చాలా రకాల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అంతే కాకుండా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Body Detox Drink: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది చెడు ఆహారాన్ని తింటున్నారు. దీంతో శరీరంలో చాలా రకాల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అంతే కాకుండా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యర్థాల కారణంగా స్థూలకాయం, కడుపు సమస్యలు, అధిక బీపీ వంటి సమస్యలు వస్తున్నాయని పలు నివేదికల్లో తెలింది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చెడు వ్యర్థాల నుంచి రక్షించుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే పై అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం కొన్ని డ్రింక్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయడంతోపాటు బరువును కూడా నియంత్రిస్తుంది.
దాల్చిన చెక్క, తేనెతో చేసిన డ్రింక్:
దాల్చిన చెక్క, తేనెతో చేసిన డ్రింక్స్ శరీరంలోని మురికిని శుభ్రం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది. ఈ చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
పుదీనా, దోసకాతో తయారు చేసిన డ్రింక్:
పుదీనా, దోసకాయ పానీయం శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. నిజానికి దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. కావున శరీరాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది. పుదీనా ఆకులలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ ప్రిస్క్రిప్షన్‌లను ఆమోదించదు.)
Also Read: SL Vs AUS: అరుదైన ఘటన.. స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్!
Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.