Vaccine Booster Dose: కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఇప్పుడొక పరిష్కారం. అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపధ్యంలో రెండు డోసులు సరిపోతాయా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్(Corona Vaccination Drive) కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్లతో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా వైరస్ (Coronavirus) సోకుతోంది.ఈ క్రమంలో వ్యాక్సిన్ రెండు డోసులు సరిపోతాయా అనే చర్చ మొదలైంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ డోసులపై ఎయిమ్స్ వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణకు, మరీ ముఖ్యంగా కొత్త వేరియంట్ల నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. రెండు డోసుల తరువాత రోగ నిరోధక శక్తి  క్షీణించే సంకేతాలున్నాయని..అందుకే మూడవ డోసు బూస్టర్ డోసు(Vaccine Booster Dose) అవసరమని గులేరియా అంటున్నారు. 


కరోనా నియంత్రణలో ముఖ్యమైన రోగ నిరోధక శక్తి (Immunity power)విషయంలో వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని డాక్టర్ రణదీప్ గులేరియా (Dr Randeep Guleria)చెప్పారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని..వ్యాక్సిన్ బూస్టర్ డోసు పరిశీలన ప్రారంభమైందని తెలిపారు. మొత్తం అందరికీ వ్యాక్సిన్ రెండు డోసులు అందిన తరువాత మూడవ డోసు అందించాలనే ఆలోచన ఉంది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశమున్నందున ఇండియాలో పిల్లలకు సైతం వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నారు. 


Also read: Covaxin Clinical Trials: బ్రెజిల్ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ రద్దు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook