How to Increase Breast Milk: పిల్లలకు పాలిచ్చే తల్లులకు ముఖ్య గమనిక. మీ బిడ్డ ఆరోగ్యం మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోతే అది బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మీరిచ్చే పాలు మీ బిడ్డకు సరిపోకపోవచ్చు. అందుకే ఈ 8 ఫుడ్స్ డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ అమోఘంగా పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తల్లి పాలు పిల్లలకు ఓ వరం. ఇందులో యాంటీ బాడీలతో పాటు ఇతర పోషకాలు కావల్సినంతగా ఉంటాయి. పిల్లల ఇమ్యూనిటీ పటిష్టంగా మారుతుంది. ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ అవసరం. కానీ చాలా సందర్భాల్లో తల్లి పాలు సరిపోవడం లేదనే సమస్య ఎదురవుతుంటుంది. దాంతో పిల్లల ఆకలి తీరకపోవడంతో బయటి పాలు తాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. 


మెంతులు. అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగిన వీటిని తల్లి పాలు పెంచేందుకు అనాదిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఇక రెండవది నట్స్ అండ్ సీడ్స్. ఇందులో బాదం, ఫ్లక్స్ సీడ్స్, చియా సీడ్స్ తీసుకుంటే అందులోని ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ల కారణంగా బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుంది. 


ఓట్స్ కూడా మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. దాంతో తల్లి పాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా కావల్సినంత ఎనర్జీ ఇస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలకు ఓట్స్ బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. సోంపులో ఫైటూ ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ఇది తల్లి పాలు తయారయ్యేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. సోంపు నేరుగా తిన్నా లేక టీ చేసుకుని తాగినా మంచి ఫలితాలు కన్పిస్తాయి.


తల్లి పాలను పెంచేందుకు బాజ్రా, దలియా కూడా బెస్ట్ ఫుడ్స్. ఈ తృణ ధాన్యాలు మనిషికి కావల్సిన ఇన్ స్టంట్ ఎనర్జీ ఇవ్వడమే కాకుండా కావల్సినన్ని పోషకాలు అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్తనాల్లో పాల పరిమాణాన్ని పెంచుతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే పప్పు తినడం చాలా మంచిది. దీనివల్ల తల్లి పాలు మరింత ఎక్కువగా తయారవుతాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్ అందుకు దోహదం చేస్తాయి. 


అన్నింటి కంటే బెస్ట్ సూపర్ ఫుడ్ పాలు లేదా పాల ఉత్పత్తులు. ఇవి శరీరంలో పాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శరీరానికి కావల్సినంత కాల్షియం అందిస్తాయి. వీటితో పాటు శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండటం అవసరం. ప్రతి రోజూ సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. హెర్బల్ టీ, ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోవాలి. డైట్ కూడా బ్యాలెన్స్‌గా ఉండాలి. 


Also read: Maize 7 Amazing Benefits: వర్షాకాలంలో మొక్కజొన్న ఎందుకు తినాలి, 7 అద్భుత ప్రయోజనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook