Breathing problem: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందా, అయితే ఈ పదార్ధాలకు దూరంగా ఉండండి
Breathing problem: శ్వాస. మనిషి బతికేందుకు కావల్సింది ఇదే. పుట్టుక నుంచి మరణం వరకూ ఇదే కీలకం. ఇందులో సమస్య ఏర్పడితే ప్రాణాంతకం కావచ్చు. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవలి కాలంలో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. కాలుష్యం, ఇతర అనారోగ్య సమస్యలు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఉంటే ఎక్కువసేపు నడవడం లేదా పరుగెట్టడం, ఏదైనా పని చేయడం చేయలేరు. ఈ సమస్య ఉంటే కొన్ని ఆహార పదార్ధాలు అస్సలు తీసుకోకూడదు.
శ్వాస సంబంధిత సమస్యలు ప్రధాన కారణం తినే ఆహారం సరిగ్గా లేకపోవడం. అందుకే ఈ సమస్య ఉన్నప్పుు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల పదార్ధాల్ని తీసుకోకూడదు. చలవ చేసే పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే సమస్య ఇంకా పెరుగుతుంది.
పాలు
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో దాదాపుగా అన్ని రకాల న్యూట్రియంట్లు ఉంటాయి. కానీ శ్వాస సంబంధిత సమస్య ఉంటే..పాలు తీసుకోకూడదు. పాలు తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
ఉప్పు
ఉప్పు ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. ఇందులో ఉండే సోడియం కంటెంట్ కారణంగా రక్తపోటు అధికమౌతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఫలితంగా శ్వాస సంంధిత సమస్యలు ఏర్పడుతాయి.
మద్యం
మద్యం కేవలం సామాజిక వ్యసనమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా. మద్యం అతిగా సేవించడం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడుతుంది. గుండెకు కూడా మద్యం అనేది చాలా ప్రమాదకరం. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
వక్క
వక్క తినడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. దీనివల్ల చుట్టుపక్కల వ్యర్ధాలు వ్యాపిస్తాయి. అంతేకాకుండా మౌత్ కేన్సర్ సమస్య ఉత్పన్నమౌతుంది. అంతేకాకుండా శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతాయి.
Also read: Beauty Tips: శరీరంలో ఏ విటమిన్లు లోపిస్తే..మచ్చలు, పింపుల్స్ ఏర్పడుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook