Broccoli: బ్రోకలీ ఒక సూపర్ ఫుడ్.. నమ్మలేని 4 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు షాకే..
Broccoli Benefits: బ్రోకోలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్యాలీఫ్లవర్ మాదిరి కనిపిస్తుంది, బ్రోకోలీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రోకోలిలో 90% పైగా నీరు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి. బ్రోకోలి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Broccoli Benefits: బ్రోకలి ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఈ సూపర్ ఫుడ్ డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ శరీరానికి అందుతాయి. 90 శాతానికి పైగా నీరు కలిగి ఉంటుంది. బ్రోకలీ తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ కే, ఫోలెట్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రోకోలి డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు. బ్రోకోలితో మనకు అందించే నాలుగు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
షుగర్ కంట్రోల్...
బ్రోకోలి తరచూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు బ్రోకోలిని కూడా డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బరువు పెరగకుండా కూడా ఉంటారు. బ్రోకోలీ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటుంది. అయితే, డయాబెటీస్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా బ్రోకోలీ తినాలి. ఇది చక్కెర వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది.
ఇమ్యూనిటీ బూస్ట్...
బ్రోకోలీ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఈ రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడతారు. బ్రోకోలీ తరచూ తీసుకోవడం తప్పకుండా అలవాటు చేసుకోవాలి.
పేగు ఆరోగ్యం..
పేగు ఆరోగ్యానికి బ్రోకలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. బ్రోకోలీలో పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బ్రోకలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు సమస్యలు రావు. అంతేకాదు బ్రోకోలీ తినడం వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. బ్రోకోలీ అన్నం, చపాతీలు రెండిటిలో బాగుంటుంది.
ఇదీ చదవండి: నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..
క్యాన్సర్..
ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అది వివిధ రకాల క్యాన్సర్ కావచ్చు. అయితే బ్రోకోలీ తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. ఈ ఆకుపచ్చ కూరగాయ వల్ల కేన్సర్ కణాలు నామరూపం లేకుండా పోతాయి.
ఇదీ చదవండి: జూనియర్ హిట్‌మ్యాన్ వచ్చేశాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ వైఫ్ రితిక సజ్దే..
బ్రోకోలిని క్యాలీఫ్లవర్ మాదిరి తయారు చేసుకోవచ్చు. వీటిని ఫ్రై రూపంలో తీసుకోవచ్చు లేదా సూప్ రూపంలో కూడా వండుకోవచ్చు. బ్రోకోలి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది చూడటానికి ఆకు పచ్చ రంగులో ఉంటుంది. కానీ ఎక్కువ మంది వీటిని తీసుకోరు. అయితే మామూలు కూరగాయల కంటే కూడా దీనిలో అధిక ప్రోటీన్స్, మినరల్స్ కలిగి ఉంటాయి. బ్రోకోలి అత్యంత ఆరోగ్య కరం కాబట్టి ఈసారి మీరు కూడా బ్రోకోలి డైట్ లో చేర్చుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి