Brown Rice Benefits For Diabetes:  ప్రస్తుతం భారతీయులే కాకుండా అన్నాన్ని ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకుంటున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. కావున శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఈ వైట్ రైస్‌ను  టైప్ 2 మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తింటున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, స్టార్టర్స్ పరిమాణం అధికంగా ఉండడం వల్ల  రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. టైప్ 2 మధుమేహ రోగులు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ వైట్‌ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల బియ్యం ఈ వ్యాధి వారికి ఎంత ప్రమాదం..!:


పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హామిల్టన్ హెల్త్ సైన్సెస్ (PHRI - పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), హామిల్టన్ హెల్త్ సైన్సెస్, కెనడా మెక్ మాస్టర్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ప్రకారం.. వైట్ రైస్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి.


రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది:


ఈ 10 సంవత్సరాలలో 21 దేశాల నుంచి 1,30,000 మంది పెద్దలపై టైప్ 2 డయాబెటిస్ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో విస్తుగొలుపే నిజాలు బయటకు వెల్లడయ్యాయి. ఇందులో తెల్ల బియ్యం తిన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో నివేదికలు వివరించాయి. అన్నం తింటే మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం ఉందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం భారతదేశంతో పాటు చైనా, బ్రెజిల్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాతో సహా అనేక దేశాలలో చేశారు.


బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల కలిగే నష్టాలు:


సహజంగా పండించిన బియ్యం కంటే తెల్లటి, పాలిష్ చేసిన బియ్యం తినడం చాలా ప్రమాదకరమని ఈ అధ్యాయనం నిరూపించాయి. తెల్ల బియ్యాన్ని పాలిష్ చేసే క్రమంలో అందులోని అనేక పోషకాలు తొలగిపోయి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.


డయాబెటిక్ రోగులకు బ్రౌన్ రైస్ మంచిదేనా:


గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ ఈ విధంగా పేర్కొన్నారు. బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచి లాభాలుంటాయని ZEE NEWSకు ఆయన తెలిపారు. అరకప్పు బ్రౌన్ రైస్‌లో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి మధుమేహం నిమంత్రణలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది


Also Read: Jos Buttler New Record: సూపర్ ఫామ్‌లో జోస్ బట్లర్..తాజాగా మరో రికార్డు బద్ధలు..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.