Buttermilk Benefits: సమ్మర్లో మజ్జిగ తాగితే శరీరానికి కలిగే లాభాలు అన్నో ఇన్నో కావు!
Buttermilk Benefits In Telugu: మజ్జిగను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Buttermilk Benefits In Telugu: మజ్జిగను ఆయుర్వేద శాస్త్రంలో అమృతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మన పూర్వీకులు ఇంటి వచ్చిన బంధువులకు టీ, కూల్ డ్రింక్స్‌కి బదులుగా మజ్జిగనే ఇచ్చేవారు. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా పొట్టకు కూడా చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా అలసిపోయినప్పుడు మజ్జిగను తాగడం వల్ల తక్షణ శక్తిని పొందుతారు. ఇవే కాకుండా ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూట్రియంట్ రిచ్:
మజ్జిగను ఆయుర్వేద నిపుణులు పోషకాల పవర్‌హౌస్‌గా కూడా పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ బి12, కాల్షియం, ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు, ప్రొటీన్లు కూడా లభిస్తాయి.
ఎముకలు దృఢంగా తయారవుతాయి:
మజ్జిగలో శరీరానికి కావాల్సి పోషకాలతో పాటు 350 mg కాల్షియం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు మజ్జిగను తీసుకోవడం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక మోతాదులో విటమిన్ డిలో లభిస్తాయి. కాబట్టి బోలు ఎముక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ నుంచి ఉపశమనం లభిస్తుంది:
జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే వాటిల్లో మజ్జిగ కూడా ఒకటి. కాబట్టి వేసవి కాలంలో తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట మజ్జిగను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
బరువు నియంత్రణ:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో తక్కువ పరిమాణంలో కేలరీలు లభిస్తాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు మజ్జిగను తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
గుండె ఆరోగ్యానికి:
మజ్జిక శరీర బరువును నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని పొటాషియం, సోడియంను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. దీని కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి