Buttermilk Precautions: ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. కొన్ని అలవాట్లు కూడా ఆరోగ్యపరంగా ప్రయోజనం లేదా నష్టాలకు కారణమౌతుంది. కొంతమందికి బెడ్ టీ  లేదా బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరు మజ్జిగ తాగుతుంటారు. మజ్దిగ తాగే విధానమే ఆరోగ్యపరంగా నష్టాలకు కారణం కావచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మజ్జిగ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం వేడి చేయకుండా చలవ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు శరీరానికి చాలా మంచిది. అయితే చాలామంది మజ్జిగలో ఉప్పు లేదా పంచదార కలుపుకుని తాగుతుంటారు. మజ్జిగ తాగే విధానాన్ని బట్టి లాభనష్టాలు మారుతుంటాయి. మజ్జిగలో పంచదార కలుపుకుని తాగితే శరీరాన్ని ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్స్ అనేవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందులో ఉండే కాల్షియం కారణంగా ఎముకలకు బలం చేకూరుతుంది. 


అయితే మజ్జిగలో పంచదార కలలిపి తాగడం వల్ల కేలరీలు పెరిగి బరువు నియంత్రణ తప్పుతుంది. అంతకాకుండా డయాబెటిస్ రోగులకు మంచిది కాదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పంచదార అనేది బ్యాక్టీరియాను పెంచి దంతాలు, చిగుళ్ల సమస్యలకు కారణమౌతుది. పంచదార ఎక్కువైతే జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. గుండె వ్యాధులు రావచ్చు. వైద్యుల సలహా ప్రకార కూడా వీలైనంత వరకూ పంచదారకు దూరంగా ఉండాలి. 


మజ్జిగలో పంచదార కలుపుకుని తాగే కంటే అందులో తేనె లేదా పటిక బెల్లం కలిపితే ఆరోగ్యపరంగా కాస్త మంచిది. వీటితో పాటు పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. మజ్జిగ అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉప్పుతో కలిపి తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. డీ హైడ్రేషన్ సమస్యతో తరచూ బాధపడేవారికి ఇది మంచిది.


Also read: Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.