Pomegranate Detox Juice: ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా తొలుగుతాయి!
Pomegranate Detox Juice Recipe: పండ్లను ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు తీసుకోవడం కష్టంగా ఉంటే వీటిని జ్యూస్ గా చేసుకొని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
pomegranate detox juice recipe: ప్రతిరోజు పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే ఈ వ్యర్థాలు తొలగించడంలో కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడుతాయి. అందులో దానిమ్మ పండు ఒకటి . ఇది శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిటాక్స్ జ్యూస్‌కి కావాల్సిన పదార్థాలు:
దానిమ్మపండు జ్యూస్ పావు కప్పు, నాలుగు గ్లాసుల నీళ్లు, ఒక నిమ్మకాయ రసం, కీరదోస ముక్కలు, పావు కప్పు దానిమ్మ పండు గింజలు, పుదీనా, తేనె టీస్పూన్
డిటాక్స్ జ్యూస్‌ను తయారు చేసే విధానం:
ముందుగా మిక్సీ జార్‌లో నీళ్ల పోసుకోవాలి. ఇందులోకి కీరదోస ముక్కుల, దానిమ్మ పండు జ్యూస్, పుదీనా ఆకులు, నిమ్మరసం, దానిమ్మ పండు గింజలు, తేనె వేసుకోని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు తగ్గుతారు. షుగర్ కంట్రోల్ చేయడంలో ఈ జ్యూస్ సహాయపడుతుంది. కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఈ జ్యూస్‌తో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter