Curd For Diabetes: మన పూర్వీకుల నుంచి ఆహారాల్లో పెరుగును వినియోగించడం వస్తోంది నిజానికి చాలామంది పెరుగు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది దీనిని చక్కెర వేసుకొని కలుపుకొని తాగితే, మరి కొంతమంది మాత్రం నేరుగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు. అలాగే మరి కొంతమంది అయితే పెరుగును మజ్జిగ లా తయారు చేసుకొని ఆహారాల్లో వినియోగిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మన పూర్వీకులు పెరుగన్నాన్ని ఎక్కువగా తినే వారట. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండే వారిని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా ప్రతిరోజు రెండు పూటలా పెరుగన్నాన్ని తినడం వల్ల శరీరాన్ని కలిగే కొన్ని ఆశ్చర్యపరిచే లాభాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక్కసారైనా పెరుగును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు హై బీపీని తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో మన జీర్ణ క్రియకు కావలసిన మంచి బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు పెరుగన్నాన్ని తినడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు దూరం అవుతాయి. ఇటీవల కొంతమంది సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఒకటి లేదా రెండు కప్పుల పెరుగును తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు పెరుగన్నాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చు.


నిజానికి పెరుగులో శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పెరుగన్నాన్ని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతోపాటు పెరుగులో ఉండే కొన్ని గుణాలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే చాలామంది పెరుగును హెయిర్ మాస్క్ గా కూడా వినియోగిస్తారు దీనిని ఇలా వినియోగించడం వల్ల జుట్టుకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 


అలాగే ఇటీవలే కొన్ని అధ్యయనాలు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిరోజు పెరుగును తీసుకోవడం కారణంగా మధుమేహం బారిన పడకుండా మనది మనమే రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల నెల రోజుల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి పెరుగు తినడం కారణంగా ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కూడా కలుగుతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి