Capsicum Benefits: క్యాప్సికంతో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్.. ఏంటి నమ్మట్లేదా?
Capsicum Benefits: క్రమం తప్పకుండా ఆహారంలో క్యాప్సికాన్ని చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలున్నాయి. ఇందులో లభించే కొన్ని మూలకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Capsicum Benefits In Telugu: భారతదేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో క్యాప్సికాన్ని ప్రధాన వంటకం గా భావిస్తారు క్యాప్సికం లేనిది ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చు. అందుకే దీనిని ప్రధాన కూరగాయగా భావిస్తారు. క్యాప్సికం తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి ఎందుకంటే ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి దీంతో పాటు ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల వారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చాలామందిని క్యాప్సికాన్ని పచ్చిగా కూడా తింటుంటారు నిజానికి ఉడకబెట్టిన క్యాప్సికాని కంటే పచ్చిది తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే క్రమం తప్పకుండా క్యాప్సికాన్ని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో క్యాప్సికం చేర్చుకోవడం చాలా మంచిది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తినడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. అంతేకాకుండా ముడతలు, మచ్చలు ఏర్పడకుండా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు తప్పకుండా క్యాప్సికాన్ని తినండి.
కళ్ళ ఆరోగ్యానికి మేలు చేయండి:
క్యాప్సికంలో ఉంటే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు రే చీకటి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:
క్యాప్సికం కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా కీలకపాత్ర పోషి స్తున్న ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఆహారంలో క్యాప్సికం చేర్చుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు.
కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది:
క్యాప్సికం లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.