Cardamom Health Facts: యాలకుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవే..
Cardamom Health Facts In Telugu: యాలకులతో తయారుచేసిన డికాషన్‌ని లేదా నీటిని ప్రతిరోజూ తాగితే శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cardamom Health Facts In Telugu: యాలకుల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్ల లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మరిగించి తీసుకున్న నీటిని ప్రతి రోజు తీసుకుంటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యాలకుల నీటిని తాగడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
యాలకుల నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ప్రతి రోజు ఉదయం ఖాళీ పొట్టతో ఏలకులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలైనా మలబద్ధకం, వాపు, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బాడీ డిటాక్సిఫై కోసం:
యాలకుల టీ లేదా నీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం నిర్విషీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మూత్రవిసర్జన గుండా శరీరంలోని పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మాత్ర సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
కేలరీలు బర్న్ చేయడానికి:
యాలకుల నీటిని ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు శరీరంలోని కేలరీలు కూడా సులభంగా బర్న్ అవుతాయి. అంతేకాకుండా శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సులభంగా శరీర బరువు తగ్గాలనుకునేవారు కొలెస్ట్రాలను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా యాలకుల తో తయారు చేసిన డికాషన్ను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అధిక రక్తపోటు నియంత్రణకు..
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎంత సులభంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందితే అంత మంచిది. లేకపోతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు యాలకులతో తయారు చేసిన టీ ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర రక్తపోటు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter