COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cardamom Tea For Monsoon Season: ఏలకుల టీ తాగడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ టీని వానా కాలంలో తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వర్షాకాలంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఏలకుల టీని వర్షకాలంలో ప్రతి రోజు తాగడం వల్ల అన్ని రకాల సీజన్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు వానా కాలంలో ఉదయాన్నే ఏలకుల టీని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది వానాకాలంలో తినకూడని ఆహారాలు తిని జీర్ణక్రియ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఏలకులతో తయారు టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.


పుష్కలమైన పోషకాలు లభిస్తాయి:
ఏలకుల టీలో  మెగ్నీషియం, ఐరన్,  విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


ఒత్తిడి నుంచి ఉపశమనం:
చాలా మందిలో ఒత్తిడి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వానా కాలంలో ఈ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఏలకుల టీని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. 


మెదడును చురుకుగా చేస్తుంది:
ఏలకులలో ఉండే మూలకాలు మెదడును ఉత్తేజితం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా టెన్షన్‌ ఇతర సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు రెండు సార్లు ఏలకుల టీని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతుంది. 


డయాబెటిస్: 
వానా కాలంలో మధుమేహం ఉన్నవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు తరచుగా పెరుగుతాయి. అయితే ఇలాంటి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఏలకుల టీని తాగాల్సి ఉంటుంది. ఈ టీని వర్షాకాలంలో ప్రతి రోజు తాగడం వల్ల తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook