Cardiac Diet Plan Food List: గుండెను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే శరీర అంత యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు రాకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు అధిక బరువు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు పెరగడం కారణంగా చాలా మందిలో గుండె సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు సులభంగా దూరమవుతాయి.
 
గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే:
బెర్రీలు:

తాజా బెర్రీలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ బెర్రీలను ప్రతి రోజు ఆల్పాహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకు కూరలు:
గుండెను, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆకు కూరలు కూడా సహాయపడతాయి.  ఎందుకంటే ఈ కూరగాయలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు  అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి పోషకాలు లభించి  గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు పాలకూరను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 


టొమాటో:
టొమాటో కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండెను అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు టొమాటోలను ఆహారాల్లో వినియోగించడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వ్యాధులను దూరం చేస్తుంది. 


వాల్నట్:
వాల్‌నట్స్‌ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్ లభిస్తాయి. కాబట్టి గుండెను ఆరోగ్య ఉంచేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వాల్‌నట్స్‌ను నీటిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


High Protein FoodsHigh In Protein FoodsProtein FoodsWhat Is High In Protein