Carrot Juice For Weight Loss: శరీర బరువు పెరగడం సులభమైనప్పటికీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టంగా మారుతోంది. అయితే ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి జిమ్‌లలో వర్కవుట్స్‌ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన హోం రెమెడీస్‌ను వినియోగించడం వల్ల బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊబకాయాన్ని తగ్గించే హోం రెమెడీస్:
భారీగా బరువు పెరిగే వారు తప్పకుండా రోజూ తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ 20 నిమిషాల పాటు యోగా  చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌తో పాలు, శరీర బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో రాత్రి పూట డిన్నర్‌ లైట్‌గా చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  


క్యారెట్ రసం:
శరీర బరువును తగ్గించడానికి తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా క్యారెట్, క్యాబేజీ సూప్‌గా తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా సులభంగా తగ్గిస్తుంది.


నిమ్మకాయ-తేనె రెమెడీ:
మీ శరీర బరువును తగ్గించుకోవడానికి ఇది చౌకైన చిట్కాగా భావించవచ్చు.  గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం, తేనె కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.


రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి:
శరీర బరువును సమతుల్యంగా ఉంచడానికి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది.  అంతేకాకుండా ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో సులభంగా శరీర బరువు తగ్గుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook