COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cholesterol Control: రోజురోజుకు గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం శరీరంలో పెరిగే కొలెస్ట్రాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరిలో అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవన విధానం, ధూమపానం మద్యపానం వంటి అలవాట్ల కారణంగా కూడా గుండెపోటు సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. 


ప్రపంచంలో గుండెపోటుతో మరణించే వారిలో 80% కొలెస్ట్రాల్ పెరిగిన వారేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి మీరు కూడా హై కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతుంటే దానిని కరిగించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీనికోసం ఆరోగ్యానికి సూచించే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరక శ్రమను పెంచాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు గంటపాటు వాకింగ్ లేదా వ్యాయామాలు చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలా చేసిన తర్వాత పచ్చి క్యారెట్నుగాను దానితో తయారుచేసిన జ్యూసులు గాని తీసుకుంటే సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు శరీరంలోని చెడు కొవ్వును కరిగించడమే కాకుండా శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


క్యారెట్ నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె సమస్యల నుంచి ఉపశమనం లభించి.. గుండెపోటు రాకుండా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. తరచుగా రోగ నిరోధక శక్తి లోపం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్యారెట్ నుంచి తీసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు క్యారెట్ రసాన్ని తాగవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ రక్తపోటును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి