Cashews Almonds For Winter Digestive Problems And Solutions: ప్రతిరోజు ఉదయం పూట జీడిపప్పు, బాదంపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వీటిలో ఉండే పోషకాలు ఆ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు తరచుగా బాదం, జీడిపప్పులను తీసుకోవాలని సూచిస్తారు. ఇవి రుచిలో సాధారణమైనప్పటికీ వీటిని వేయించుకుని తింటే రుచి పెరిగే అవకాశాలున్నాయి. అయితే చాలామందికి వీటిని ప్రతిరోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు. కొందరైతే వీటిని తరచుగా తీసుకుంటే జీర్ణ క్రియలో సమస్యలు రావచ్చు అని అభిప్రాయపడుతుంటారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని వైద్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా వీటిని ప్రతిరోజు చిన్నపిల్లలకి ఆహారంలో ఇవ్వడం వల్ల వారి శరీరం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి వీటిని ఉదయం పూట అల్పాహారానికి బదులుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు పిల్లలకు తినిపిస్తే తీవ్రవాదుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు జీడిపప్పు బాదం సహాయపడతాయి.


జీవనశైలి కారణంగా చాలామందిలో జీర్ణక్రియ సమస్యలు పన్నమవుతున్నాయి. జీర్ణాశయ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. బాదం పిస్తా జీడిపప్పులను ఉదయం పూట అల్పాహారంకి బదులుగా తీసుకోవాల్సి ఉంటుంది. రెట్టింపు ప్రయోజనాలు పొందడానికి.. ఈ డ్రై ఫ్రూట్స్ ను ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహార పదార్థాలు అయినా అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే కూడా చాలా రకాల దుష్ప్రభావాలు వస్తాయని ఆరోగ్యంగా చెబుతున్నారు. కాబట్టి వీటిని ప్రతిరోజు 8 పలుకుల నుంచి పది పలుకుల దాకా తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి


Also Read: Prince OTT: 'ప్రిన్స్‌' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి