Chamomile Tea For Good Sleep: ప్రాచీన కాలం నుంచి చామంతి టీని తాగడం అలవాటుగా వస్తోంది. ఈ టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు రెండు నుంచి మూడు సార్లు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ టీలో ఉండే మూలకాలు నిద్రలేమి సమస్యలను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పాటు శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చామంతి టీ తాగడం వల్ల కలిగే లాభాలు:
నిద్రను ప్రేరేపిస్తుంది: 

చామంతి టీలోని అపిజెనిన్ అనే పదార్థం మన మెదడులోని GABA రిసెప్టర్‌లను ప్రభావితం చేసి నిద్రను ప్రేరేపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి నిద్ర మందులా పని చేస్తుంది.


ఒత్తిడిని తగ్గిస్తుంది: 
చామంతి టీ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా మెదడుకు మంచి రిలాక్స్‌ను అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో  పాటు ఆందోళన, కోపం వంటి భావనలు తగ్గుతాయి.


జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది: 
చామంతి టీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఔషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రభావంతంగా సహాయపడుతుంది.


రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: 
చామంతి టీలోని యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. దీనిని ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది: 
చామంతి టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై వచ్చే వాపు, ఎర్రబాటలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది.


గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: 
చామంతి టీ రక్తనాళాలను విశాలం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.