Chikoo Health Benefits: పండ్లలో సపోటా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు. శరీరంలో నీటి కొరత ఉన్న సమయంలో ఈ పండును తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సపోటాలో లభించే కొన్ని పోషకాలు డీహైడ్రేషన్ సమస్యను తొలగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. ఈ పండు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే సపోటా పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సపోటా పండు వల్ల కలిగే ప్రయోజనాలు..


1. సపోటా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. పండులో పొటాషియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


2. సపోటా తినడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉంటే, దానిని తినమని వైద్యులు సిఫారసు చేస్తారు.


3. జలుబు సమస్యను తగ్గించడంలో సపోటా పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సపోటాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.


4. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు.. ఏ వ్యక్తి అయినా అశాంతి, చిరాకు, ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు సపోటా పండ్లను తీసుకోవడం ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని తినడం వల్ల ఐరన్ సప్లిమెంట్లు శరీరానికి లభిస్తాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!


Also Read: White Hair Treatment: తెల్లజుట్టు నల్లగా మారేందుకు ఈ 3 ఇంటి చిట్కాలను పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook