Danger Signs: శరీరంలో ఒక్కోసారి కన్పించే కొన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని ప్రమాదకరం కావచ్చు. కొన్ని ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి పట్టినట్టుంటే అది కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతం కావచ్చు. ధమనుల్లో రక్త సరఫరాకు ఆటంకమై గుండె నొప్పులకు కారణం కావచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరం. నియంత్రించడం లేదా నిర్మూలించడం ఎంత సులభమూ నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. రాత్రి పడుకొనేటప్పుడు కాళ్లలో నొప్పులు వచ్చినా లేదా తిమ్మిరి పట్టినా నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ పెరగి ధమనుల్లో బ్లాకేజ్ కు కారణం కావచ్చంటున్నారు. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురుకావచ్చు. వాస్తవానికి కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ పరిమితంగా ఉండాలి. పరిమితి దాటితే హాని కారకమౌతుంది. కొలెస్ట్రాల్ రక్త వాహికల్లో పేరుకుపోతే దానినే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అంటారు. రక్త సరఫరాకు ఆటంకం కల్గిస్తుంది. దాంతో  హార్ట్, బ్రెయిన్, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు. 


కాళ్లు తిమ్మిరి లేదా నొప్పి ఎందుకొస్తుంది


కాలి నరాల్లో కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్త సరఫరా కాళ్ల వరకూ సరిగ్గా ఉండదు. దాంతో కాళ్లలో నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలుంటాయి. దీనినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు.కొలెస్ట్రాల్ బ్లాకేజ్ ఇతర లక్షణాలు కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా కాళ్లు చల్లగా ఉండటం, కాలి గాయాలు త్వరగా మానకపోవడం, కాలి కండరాల్లో నొప్పి, బలహీనత, అలసట ప్రధానంగా ఉంటాయి. 


కొలెస్ట్రాల్ బ్లాకేజ్ కారణాల్లో హై కొలెస్ట్రాల్, ధూమపానం, డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, కుటుంబంలో గుండె వ్యాధుల చరిత్ర ఉన్నాయి. కొలెస్ట్రాల్ బ్లాకేజ్ జరిగినప్పుడు జీవనశైలి మార్చుకోవాలి. మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరమౌతుంది. హెల్టీ డైట్ తీసుకోవడం, రోజూ తగిన వ్యాయామం చేయడం, ధూమపానానికి స్వస్తి చెప్పడం, బరువు తగ్గించుకోవడం అవసరం. 


Also read: Best Foods for Liver: ఈ 5 ఫుడ్స్ డైట్ లో ఉంటే ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook