Cholesterol Control Tips: చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్​ వల్ల అనేక సమస్యలు వస్తాయి. లావు పెరగటం సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దీని వల్ల చాలా మంది కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా, తక్కువ రోజుల్లోనే కొలస్ట్రాల్​ను తగ్గించుకునే టిప్స్ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారానికి 3 సార్లు గుడ్లు..


గుడ్లు తరచుగా తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అయితే గుడ్డులోని పసుపు భాగాన్ని తినకూడదని చాలా భావిస్తుంటారు. అయితే అ పూర్తిగా తప్పని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్డు పూర్తిగా తింటేనే దాని పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.


చేపలు తినడం..


చేపలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండే సంబంధి సమస్యలు ఉన్న వారికి ఇవి మంచివి చెబుతున్నారు నిపుణులు.


తృణధాన్యాల తీసుకోండి..


తీనే ఆహారంలో తృణధాన్యాలు (జొన్నలు, రాగులు, సజ్జల వంటివి) ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇది మంచి అలవటని అంటున్నారు. వీటన్నింటితో పాటు పండ్లూ, కూరగాయలు సమపాలలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే కొలెస్ట్రాల్ అదుపులో ఉండి.. గుండె సహా ఇతర శరీర భాగాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయని అంటున్నారు.


Also read: Grapes Health Benefits: చక్కెర వ్యాధి సహా ఐదు వ్యాధులకు పరిష్కారం..ద్రాక్షతో ప్రయోజనాలివే


Also read: Weight Loss Tips: ఇలా చేస్తే జిమ్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే బరువు తగ్గొచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook