Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ బారిన పడుతున్నారు. అయితే దానిని అదుపులో ఉంచుకోవాడనికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసిన ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.  అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు పలు రకాల ఇంటి నివారణాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో అందుబాటలో ఉండే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు  శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.  కాబట్టి ఈ విత్తనాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పొద్దుతిరుగుడు విత్తనాల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది:


ఆయుర్వేదం శాస్త్రంలో పొద్దుతిరుగుడు విత్తనాల ప్రయోజనాల గురించి వివరించారు. దీని విత్తనాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


ఈ విత్తనాన్ని ఎలా ఉపయోగించాలి:


పొద్దుతిరుగుడు విత్తనాలను ఉదయం తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పొద్దుతిరుగుడు పువ్వుల గింజలను ఓట్స్, గంజి లేదా సలాడ్‌లో కలుపుకుని రోజూ తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ విత్తనాలను వేయించిన తర్వాత కూడా తినవచ్చు.


కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి:


1. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా దవడలు, చేతుల్లో నొప్పులు రావడం.
2. చెమట ఎక్కువగా ఉంటే దాని పట్ల నిర్లక్ష్యం వహించవద్దు.. ఇదీ కూడా చెడు  కొలెస్ట్రాల్ లక్షణం దాని లక్షణం.
3. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!


Read also:   LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook