Cholesterol Tips: కిచెన్‌లో ఉండే ఈ రెండు పదార్ధాలు చిటికెడు తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్ మాయం
Cholesterol Tips: ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. సర్వ వ్యాధులకు మూలం మాత్రం ఒకటే. శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
Cholesterol Tips: గత కొద్దికాలంగా లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ ఇలా ఒకదానికొకటి ఉత్పన్నమౌతున్నాయి. ఈ అన్నింటికీ కారణంగా కొలెస్ట్రాల్. రక్తంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్ మిగిలిన అన్ని అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటుండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. కొలెస్ట్రాల్ కారణంగా రక్తం గుండె వరకూ చేరడంలో ఇబ్బంది తలెత్తి గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా రెండు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలంటారు వైద్య నిపుణులు. రోజూ క్రమం తప్పకుండా ఈ రెండు పదార్ధాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వేగంగా తగ్గుతాయి. కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.
ప్రతి కిచెన్‌లో లభించే దాల్చిన చెక్క అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. దాల్చిన చెక్క రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముందుగా దాల్చిన చెక్కను పౌడర్‌గా చేసుకుని భద్రపర్చుకోవాలి. రోజూ ఉదయం లేచినవెంటనే కేవలం చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవాలి. కొన్నిరోజుల్లోనే మంచి ఫలితాలు కన్పిస్తాయి. అయితే చిటికెడు మించి తీసుకోకూడదు. ఎందుకంటే స్వభావరీత్యా వేడి చేస్తుంది. అందుకే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
మరో అద్బుతమైన పదార్ధం ఫ్లక్స్ సీడ్స్. ఈ సీడ్స్ తీసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఫ్లక్స్ సీడ్స్ అద్బుతంగా పనిచేస్తాయి. ఫ్లక్స్ సీడ్స్ విత్తనాలను మిక్సీలో పౌడర్‌గా చేసుకుని ఉంచుకోవాలి. రోజూ ఉదయం ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఫ్లక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: Cancer Detection: కేన్సర్ నిర్ధారణలో కొత్త ఆవిష్కరణ, రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook