ఆధునిక జీవనశైలి, బిజీ లైఫ్ , వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ పెను సమస్యగా మారుతోంది. జీవనశైలినే మార్చేస్తోంది. కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతటి ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొలెస్ట్రాల్ సమస్య సర్వ సాధారణంగా మారింది. ప్రతి పదిమందిలో ముగ్గురికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కానేరదు. డయాబెటిస్ రోగుల్లో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది ఓ సీరియస్ సమస్య. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ లక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై కూడా లక్షణాలు కన్పిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..


ముఖంపై ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టే


శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై వేడి దద్దుర్లు ఏర్పడతాయి. ఇదేదో సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ముఖంపై వేడి దద్దుర్లకు కారణం కొలెస్ట్రాల్ కూడా ఉందని గుర్తుంచుకోవాలి.


చర్మం రంగు మారడం


అధిక కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి చర్మం రంగు మారడం. అంటే ముఖం రంగు లైట్ బ్లాక్‌గా మారడం గమనించవచ్చు. కళ్ల చుట్టూ..చిన్న చిన్న గింజల్లా ఏర్పడతాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


ముఖంపై ఎర్రని గింజలు


శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే..ముఖంపై, ముక్కుకు అటూ ఇటూ ఎర్రని చిన్న చిన్న గింజల్లా కన్పిస్తాయి. ఇవి కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖంపై తరచూ ఎక్కువగా దురదగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువైనట్టు భావించవచ్చు. దీర్ఘకాలంగా ముఖంపై దురద, రెడ్‌నెస్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.


సిరోసిస్ సమస్య


సిరోసిస్ సమస్యకు చాలా కారణాలున్నా..ముఖ్య కారణం కొలెస్ట్రాల్ కూడా. కొలెస్ట్రాల్ ఎక్కువైతే సిరోసిస్ సమస్య తలెత్తవచ్చు. ఎందుకంటే శరీరంలో డ్రైనెస్ రావడం వల్ల దురద, బ్లీడింగ్ సంభవిస్తాయి.


Also read: Honey precautions: తేనె అలా తీసుకుంటే విషంతో సమానమా, ఏం జరుగుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook