Cloves: ప్రతిరోజూ ఒక్క లవంగంలో నోట్లో వేసుకుంటే.. ఇన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
Cloves In Daily Diet: ప్రతిరోజూ లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్ నుంచి నివారిస్తుంది
Cloves In Daily Diet: లవంగం మన వంటగదిలోని మసాలా. ఎన్నో ఏళ్లుగా మనం వంటల్లో వినియోగిస్తాం. ఈ చిన్న ఎండిన మొగ్గను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకుంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఇమ్యూనిటీ ..
ప్రతిరోజూ లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్ నుంచి నివారిస్తుంది. లవంగం డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. లవంగం సీజనల్ వ్యాధులు, జలుబు, ఫ్లూ నుంచి దూరంగా ఉంచుతుంది
జీర్ణ సమస్య..
లవంగాలు జీర్ణ ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఖనిజాలు గ్రహిస్తుంది.ముఖ్యంగా అజీర్తి, కడుపులో గ్యాస్, మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా నేచురల్ రెమిడీలా పనిచేస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు..
ప్రాణాంతక మంట వాపు సమస్యల నుంచి కూడా లవంగాలు కాపాడతాయి. ఇది ఆర్ధ్రరైటీస్, గుండె సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలను నివారిస్తాయి. లవంగంలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో యుగెనల్ ఉంటుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది క్రమంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
పంటి ఆరోగ్యం..
లవంగం ఎన్నో ఏళ్లుగా వివిధ మెడిసిన్స్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది పంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. లవంగంలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. అంతేకాదు చిగుళ్ల సమస్య, పిప్పి పన్ను సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీ. లవంగంలో నోట్లో వేసుకుంటే చాలు మంచి రిఫ్రెష్మెంట్‌గా పనిచేస్తుంది. లవంగంలో నేచురల్ ఎనెస్థెటిక్ గుణాలు ఉంటాయి. పంటి సమస్య నుంచి కాపాడుతుంది.
ఇదీ చదవండి: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ఫైర్..
బ్లడ్ షుగర్ లెవల్స్..
రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహిస్తాయి. మీ డైట్లో లవంగం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇన్సూలిన్ నిరోధకతను మెరుగు చేస్తుంది.
మెటబాలిజం రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్‌ను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
కాలేయ ఆరోగ్యం..
లవంగంలో డిటాక్సిఫైర్ లా పనిచేస్తాయి. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది. లివర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా ఫ్యాట లివర్ సమస్యను నివారిస్తుంది. కాలేయ పనితీరును డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..
రొంప సమస్యలు..
లవంగం రొంప సమస్యలు తగ్గిస్తుంది. అస్తమా, బ్రాంకైటీస్, దగ్గు చికిత్సగా ఉపయోగిస్తారు.లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. లవంగాలు ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.