Coconut Water and Lemon Juice: కొబ్బరి నీరు, నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కొబ్బరి నీళ్ల ప్రతి రోజూ తాగితే డీహైడ్రేషన్‌ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొబ్బరి నీరును తీసుకోవాలి. శరీరానికి కొబ్బరు నీరు ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తోందో, నిమ్మరసం కూడా శరీరానికి అన్నే ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీని రసాన్ని ప్రతి రోజూ వినియోగించడం వల్ల అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే నిమ్మ రసాన్ని, కొబ్బరి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నీరు, నిమ్మరసం:
ఇటీవల సోషల్‌ మీడియాలో చాలా రకాల రెసిపీలు వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇది కూడా సోషల్‌ మీడియా రెసిపీనే ఓ సోషల్‌ మీడియా వినియోగదారుడు నిమ్మరసాన్ని కొబ్బరి నీటిలో కలిపి తాగాడు. అంతేకాకుండా ఇలా కలిపి తాగడం వల్ల శరీరంపై కూడా ప్రభావవం పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.


ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?:
ప్రతి రోజూ కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వేసవి కాలంలో శరీరం సులభంగా హైడ్రేట్ అవుతుంది. ఎండకాలంలో ఎదైన చల్లగా తాగాలనుకునేవారు ప్రతి రోజూ ఇలా కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ దీనిని ఎనర్జీ డ్రింక్‌గా తీసుకోవచ్చు.


అతిగా కొబ్బరి నీరు, నిమ్మరసం కలిపి తీసుకోవద్దు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీరు, నిమ్మకాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నీటిలో అధిక మొత్తంలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. దీని కారణంగా నిర్జలీకరణం తొలగించబడుతుంది. అంతేకాకుండా వీటిని రెండింటిని కలుపుకుని తాగడం వల్ల సిట్రిక్ యాసిడ్‌ కూడా అధిక పరిమాణంలో శరీరానికి అందుతాయి. దీంతో సులభంగా పొట్ట సమస్యలతో పాటు, జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ ఇలా మిక్స్‌ చేసిన కొబ్బరి నీటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook