Coffee Benefits: కాఫీతో మైగ్రెయిన్ పెయిన్‌కు చెక్ పెట్టేయవచ్చు..ఎలాగంటే
Coffee Benefits: ప్రతి రోజూ కాఫీ లేదా టీ అనేవి నిత్య జీవితంలో భాగమైపోయాయి. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే కాఫీ కేవలం రిలాక్సేషన్‌కే కాదు..మెగ్రెయిన్ పెయిన్స్‌ను కూడా దూరం చేస్తుందట.
Coffee Benefits: ప్రతి రోజూ కాఫీ లేదా టీ అనేవి నిత్య జీవితంలో భాగమైపోయాయి. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే కాఫీ కేవలం రిలాక్సేషన్‌కే కాదు..మెగ్రెయిన్ పెయిన్స్‌ను కూడా దూరం చేస్తుందట.
ప్రతిరోజూ అలవాటుగా మారిన కాఫీతో దుష్పరిణామాల సంగతి అటుంచితే..ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాఫీలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే పరిమితి మించకూడదు. మితంగా తీసుకుంటే కాఫీని మించిన అద్భుతం మరొకటి లేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కాఫీలో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
కాఫీని పరిమితమైన మోతాదులో తీసుకుంటే చాలా గుణాలున్నాయి. కాఫీని మితంగా తీసుకుంటే పక్షవాతాన్ని సైతం నివారిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలో డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఇక కాఫీ రోజూ తాగితే శరీరం ఉత్తేజితంగా ఉంటుంది. అయితే రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కాఫీలో ఉండే కెఫీన్ అనే ఉత్ప్రేరకం గురించి తెలిసిందే. కాఫీ తాగగానే ఆ ప్రభావం కాస్సేపు కన్పిస్తుంది అందుకే. కొద్దిసేపటిలో రక్తపోటులో సిస్టోలిక్ పెరుగుతుంది. అందుకే రక్తపోటుతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అదే సమయంలో కాఫీలో మైగ్రెయిన్ తలనొప్పిని తగ్గించే యాంటీ మైగ్రెయిన్ ఔషధం ఉంటుంది. అందుకే ఓ కప్పు కాఫీ తాగాక..రెండవ కప్పు తాగేందుకు వ్యవధి అవసరం. అవసరం లేకుండా మాత్రలు వేసుకోకూడదు. బీపీ, టెన్షన్ ఉన్నవారు మాత్రం కాఫీకు దూరంగా ఉంటే మంచిది.
Also read: IPL 2022: ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడో ఖరారైనట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook