Constipation: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా స్ట్రీట్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అవిసె గింజలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ  గింజలు మలబద్ధకం సమస్యకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం:


మన అనారోగ్యానికి కారణం.. హానికరమైన ఆహారమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మలబద్ధకం పొట్టకు సంబంధించిన వ్యాధుల్లో అతి తీవ్రమైన సమస్యగా మారింది. అంతేకాకుండా ఈ సమస్య చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ మలబద్ధకం సమస్యతో మొటిమలు, పైల్స్ సహా అనేక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి  అవిసె గింజలు ఎంతగానో సహాయపడతాయని వారు తెలుపుతున్నారు.


ఈ విత్తనాలు మలబద్ధకంతో సహా ఉదర వాపును కూడా తగ్గిస్తుంది:


మీడియా నివేదికల ప్రకారం.. అవిసె గింజలలో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా సరిగ్గా జరుగి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే ఆహారంలో అవిసె గింజలను తప్పనిసరిగా వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి పేగు మంట, తాపజనక ప్రేగు వ్యాధిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Diabetes Health Tips: షుగర్ అదుపులో ఉండాలంటే.. డయాబెటీస్ పేషేంట్స్ ఈ నీటిని తీసుకుంటే చాలు!


Also Read: Uric Acid: యూరిక్ యాసిడ్‌ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 



 


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.