Natural Remedies: మల బద్దకం అనేది అత్యంత దయనీయమైన సమస్య. ఉదయం ఫ్రీ మోషన్ కాకపోతే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది. వాస్తవానికి మలబద్ధకమనేది చాలా రోగాలకు మూలం. మలబద్ధకాన్ని దూరం చేసే సులభమైన చిట్కాలు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకమనేది ఓ రకంగా సాధారణ సమస్యే. చాలామందిలో కన్పిస్తుంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి చికాకు, అశాంతి ఉంటాయి. ఏ పనీ చేయలేరు. ఏది తినాలన్నా భయపడుతుంటారు. మలబద్ధకం కారణంగా కడుపులో తిప్పేసినట్టుండటం, నొప్పిగా ఉండటం చూస్తుంటాం. దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్య ఉంటే..అది పైల్స్‌కు దారి తీయవచ్చు. మలబద్ధకం ఉంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం పాడవుతుంది. 


మలబద్ధకం అనేది జీవనశైలి కారణంగా, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. తరచూ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల కూడా సంభవిస్తుంది. మలబద్ధకంలో చాలా ఇతర సమస్యలుంటాయి. అసలు మలబద్ధకం లక్షణాలేంటి, ఎలా తెలుస్తుందనేది తెలుసుకుందాం..


మలబద్ఖకం లక్షణాలు


వారానికి 3 కంటే తక్కువసార్లు మల విసర్జన జరిగితే మలబద్ధకం సమస్య ఉందని అర్ధం. మలం గట్టిగా, ఎండిపోయి ఉన్నా మలబద్ధకం సమస్య ఉన్నట్టే. మల విసర్జన చేసేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా లేదా నొప్పిగా ఉన్నా..మలబద్ధకం సమస్య ఉన్నట్టే. మల విసర్జన తరువాత కడుపు పూర్తిగా క్లీన్ కాలేదని అన్పిస్తే..మలబద్ధకం సమస్య ఉందని అర్ధం.


మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహజసిద్దమైన పద్ధతులు చాలా ఉన్నాయి. ఇంట్లోనే ఆ పద్ధతుల్ని పాటించి ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. రోజూ ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మలబద్దకం సమస్య ఉండనే ఉండదు. మలబద్ధకం పోవాలంటే..రోజంతా ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. సోడా మిక్సింగ్ ఉండే కూల్ డ్రింక్స్ తాగకూడదు.


మలబద్ధకం దూరం చేసే చిట్కాలు


మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు ఫైబర్ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే మలబద్ధకం సమస్య పోతుంది. రోజూ వ్యాయామం చేయడం కూడా మలబద్ధకం సమస్యకు పరిష్కారంగా తెలుస్తోంది. రోజంతా కూర్చుని పనిచేసేవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అందుకే వ్యాయామంతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


కాఫీ లేదా టీ తాగడం ద్వారా కూడా మలబద్ధకం సమస్య నుంచి కొద్దివరకూ ఉపశమనం పొందవచ్చు. త్రిఫల చూర్ణం మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉసిరి కూడా ఉంటుంది. రాత్రి పాలు లేదా గోరు వెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలుపుకుని సేవించాలి. ఇక ప్రోబయోటిక్ ఆహారం మలబద్ధకం సమస్యను పోగొట్టేందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇక ఆలూ బుఖారా వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో సోర్బోటిల్ కూడా ఉంటుంది. ఇది ఓ రకమైన షుగర్ ఆల్కహాల్. కొంతమందికి పాల ఉత్పత్తులతో సమస్య ఉంటుంది. పాల ఉత్పత్తులతో మలబద్ధకం వస్తుంది.


Also read: Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ 7 వెజిటేబుల్స్‌ను డైట్‌లో చేర్చుకోండి.. రిజల్ట్ పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook