Nuts and Seeds: ఈ గింజలు, విత్తనాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు!
Benefits of Nuts and Seeds: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు పోషక ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన గింజలు, విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Benefits of Nuts and Seeds: ఆరోగ్యకరమైన గింజలు, విత్తనాలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు జ్ఞాపశక్తి , ఎముకలు ధృడంగా తయారు చేయడంలో సహాయపడుతాయి. చలికాలంలో వచ్చే సిజన్ వ్యాధులను కూడా తగ్గించడంలో ఇవి ఉపయోగపడుతాయి. పెద్దల నుంచి పిల్లలు, గర్భిణీ స్త్రీల తీసుకోవడం వల్ల సురక్షితంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి గింజలు, విత్తనాలు తీసుకోవాలి ..
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజలు ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రోటిన్ , మెగ్నీషియం, ట్రిప్టోఫాన్‌లు అధికంగా లభిస్తాయి. అలాగే శరీరాని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడుతాయి.
వేరుశెనగ:
వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి బయట పడటంలో సహాయపడుతుంది.
బాదం:
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా బాదం తీసుకోవడం వల్ల విటమిన్ , కొవ్వు, ప్రోటీన్ అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా శరీరాని ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read Immunity Boost Drink: రోగనిరోధక శక్తి బూస్ట్ చేసే అద్భుతమైన హోమ్ మేడ్ డ్రింక్..
పిస్తాపప్పులు:
ఈ పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల ప్రోటీన్ శరీరానికి అధికంగా లభిస్తుంది. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.
అక్రోట్ల:
అక్రోట్‌లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఇతర పోషకాలు అధికంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి.
జనపనార:
జనపనారలో ప్రోటిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యంగా ఉండచడంలో సహాయపడుతుంది.
హాజెల్ నట్స్:
ఈ హాజెల్ నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనేక పోషకాల లభిస్తాయి. హాజెల్ నట్‌లను వేయించి, వెచ్చని బ్రస్సెల్స్ స్ప్రౌట్ సలాడ్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలు:
వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపుతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్, మినరల్స్ అధికంగా లభిస్తాయి.
Also Read Asthma In Winter Season: ఆస్తమా ఉన్నవారు శీతాకాలంలో తస్మాత్ జాగ్రత్త..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter